Publish Date: Fri, 23 Nov 2007 (19:27 IST)
Updated Date: Fri, 23 Nov 2007 (19:27 IST)
రత్నాలను ధరించటం వల్ల అనుకున్న కార్యాలు నెరవేరతాయని, శుభ ఫలితాలు చేకూరతాయని విశ్వాసం. ఈ నేపథ్యంలో ఆయా రత్నాలను ధరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ఉదాహరణకు కెంపును ధరించాలనుకున్న వారు క్రింది విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
సూర్యరాశి సింహం కనుక సింహ లగ్నం, సింహరాశిలో పుట్టినవారు కెంపును ధరించవచ్చు. అలాగే సూర్యదశ జరుగుతున్నవారు 1, 10, 19, 28 తేదీలలో పుట్టినవారు కూడా కెంపును ధరించవచ్చు
ఆరోగ్యం, ఉద్యోగం, ప్రమోషన్లు, పైఅధికారుల మెప్పు, తల్లిదండ్రుల సంతోషం... తదితరాలు సూర్యునివల్ల జరిగేవి కనుక వీటికోసం సూర్యరత్నమైన కెంపు ధరిస్తే అన్నింటా శుభం చేకూరుతుందని విశ్వాసం.