Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీకు మీరే మాకు మేమే... 2021లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ లిస్ట్

Advertiesment
మీకు మీరే మాకు మేమే... 2021లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ లిస్ట్
, మంగళవారం, 28 డిశెంబరు 2021 (11:36 IST)
ఓ జంట విడిపోవడానికి ఏవేవో కారణాలు బయటకు రావచ్చు. కానీ విడిపోయినవారికి మాత్రమే తెలుసు అసలు కారణం. పెళ్లితో ఒక్కటై కొన్ని కారణాల వల్ల ఎంతో బాధతో విడాకులు తీసుకుని విడిపోయే జంటలు 2021లో చాలామంది వుండవచ్చు. కానీ గ్లామర్ ఇండస్ట్రీలో వుండేవారు విడిపోతే అది సంచలనమే అవుతుంది. తాము ఎంతగానో ఇష్టపడే తారల జీవితాలు ఇలా అయ్యాయేమిటా అని వారివారి అభిమానులు ఎంతో బాధపడుతారు. ఈ ఏడాదిలో టాలీవుడ్, బాలీవుడ్ ఇతర సినీ ఇండస్ట్రీల్లో విడాకులు తీసుకున్న జంటల వివరాలు చూద్దాం.

webdunia
ప్రముఖ దక్షిణాది నటి సమంత తన భర్త నాగ చైతన్యతో అక్టోబర్ 2021లో విడిపోయారు. ఈ జంట 2017లో వివాహం చేసుకున్నది. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ అని పేరు తెచ్చుకున్నది. ఐతే 2021 ద్వితీయార్థం నుంచి వీరిరువురూ విడిపోతారంటూ ఊహాగానాలు వినిపించాయి. ఐతే అవి నిజం కాదనుకున్నారు కానీ తామిద్దరం విడిపోతున్నామంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు చైసామ్.

 
సుస్మితా సేన్- రోహ్మాన్ షాల్ విడిపోయారని చాలా కాలంగా పుకార్లు ఉన్నాయి. అయితే వీరిద్దరూ ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఇటీవల, సుస్మితా సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో, రోహ్‌మాన్ షాల్‌తో కలిసి వున్న ఓ ఫోటోని పంచుకున్నారు, "మేము స్నేహితులుగా జీవితం ప్రారంభించాం, ఇకపై స్నేహితులుగా ఉంటాము! మా మధ్య సంబంధం ముగిసింది... ప్రేమ మిగిలిపోయింది." అంటూ పేర్కొన్నారు.

webdunia
ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు అమీర్ ఖాన్, కిరణ్ రావు జూలై 2021లో తమ 15 ఏళ్ల వివాహానికి ముగింపు పలికి ఉమ్మడి ప్రకటనలో విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ జంట ఒకరికొకరు సహ-తల్లిదండ్రులుగా, కుటుంబంగా కనెక్ట్ అవుతూనే ఉంటారని పేర్కొన్నారు.

 
గాయకుడు, రాపర్ యో యో హనీ సింగ్ భార్య షాలినీ సింగ్ అతనిపై గృహహింస, వ్యభిచారం చేయమని ఒత్తిడి చేస్తున్నాడంటూ ఆరోపించింది. ఇది కాస్తా ఈ సంవత్సరం ఆగస్టులో వారి విడాకులకు దారితీసింది. షాలినీ సింగ్ గృహ హింస ఆరోపణలతో పాటు వారి పెళ్లి తర్వాత అనేక వివాహేతర సంబంధాలలో తన భర్త ప్రమేయం గురించి ఆరోపించింది.
వీరిద్దరూ చిన్ననాటి నుంచి ప్రేమికులు, హనీ సింగ్ జనవరి 23, 2011న తన లేడీ లవ్‌తో కలిసి ఏడడుగులు నడిచాడు. వీరిద్దరూ 2021లో పదేళ్ల వైవాహిక ఆనందానికి అడ్డుకట్ట వేసుకున్నారు.

webdunia
భారత క్రికెటర్ శిఖర్ ధావన్- అతని భార్య ఏషా ముఖర్జీ వివాహం జరిగి ఎనిమిదేళ్లు. ఈ ఏడాది వారు విడాకులు తీసుకున్నారు. సెప్టెంబర్‌లో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, ఏషా ముఖర్జీ తాను ఇప్పుడు రెండుసార్లు విడాకులు తీసుకున్నట్లు వెల్లడించింది. 2012లో వివాహం చేసుకున్న వీరికి జోరావర్ అనే పాప ఉంది. ఏషా ముఖర్జీ మెల్‌బోర్న్‌కు చెందినవారు, ఆమె ఒకప్పుడు బాక్సర్‌.

webdunia
నుస్రత్ జహాన్, నటి మరియు టిఎంసి ఎంపీ అయిన ఆమె 2019లో టర్కీలో నిఖిల్ జైన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం అనేక వివాదాలకు దారి తీసింది. వాటిలో ముఖ్యమైనది వారు భారతదేశంలో తమ వివాహాన్ని నమోదు చేసుకోకపోవడం. ఈ జంట విడిపోయినట్లు నవంబర్ 2020 నుండి వార్తలు వచ్చాయి. అయితే మార్చి 8, 2021న, నుస్రత్ తమ వివాహాన్ని రద్దు చేయాలని నిఖిల్ కోర్టులో ఫిర్యాదు చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో శీతాకాల సెలవులు.. పాఠశాలల మూసివేత