Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా కోరల్లో చిక్కిన కాంగ్రెస్ నేత ఆజాద్ - పనిచేయని రెమ్ డెసివిర్ ఔషధం!

కరోనా కోరల్లో చిక్కిన కాంగ్రెస్ నేత ఆజాద్ - పనిచేయని రెమ్ డెసివిర్ ఔషధం!
, శుక్రవారం, 16 అక్టోబరు 2020 (16:58 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, జమ్మాకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఆయన ట్వీట్ చేశారు.
 
అయితే, తాను ప్రస్తుతం హోం క్యారంటైనులో ఉన్నట్టు చెప్పారు. అదేసమయంలో తనతో కాంటాక్టులోకి వచ్చిన వారంతా దయచేసి కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని కోరారు. 
 
రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఇప్పటికే పలువురు కీలక నేతలు కరోనా బారిన పడ్డారు. మన దేశంలో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 63 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు, కరోనా వైరస్ చికిత్సలో ఇటీవల కాలంలో అత్యధికంగా వినియోగిస్తున్న ఔషధం రెమ్‌డెసివిర్. కరోనా లక్షణాలు మధ్యస్థంగా ఉన్నవారిలో ఆ లక్షణాలు మరింత తీవ్రం కాకుండా వైద్యులు యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ వాడుతున్నారు. 
 
కరోనా చికిత్సలో ఇదే ప్రాణాధారమైన మందు అని ప్రచారం జరగడంతో రూ.5,400కి లభ్యమయ్యే ఇంజక్షన్ వైల్ కాస్తా, బ్లాకులో రూ.30 వేల వరకు ధర పలికిన సందర్భాలున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా సోకిన సమయంలోనూ ఈ ఔషధాన్ని వినియోగించారు.
 
అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రెమ్‌డెసివిర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా చికిత్సలో ముఖ్య ఔషధంగా ఉపయోగిస్తున్న రెమ్‌డెసివిర్‌తో అనుకున్న మేర ప్రయోజనాలేవీ కనిపించడంలేదని స్పష్టం చేసింది. కరోనా రోగులు కోలుకోవడం, వారిని ప్రాణాపాయం నుంచి బయటపడేయడం వంటి అంశాలపై రెమ్‌డిసివిర్ ఏమాత్రం ప్రభావం చూపడంలేదని వివరించింది.
 
దీనిపై డబ్ల్యూహెచ్ఓ ఓ అధ్యయనం చేపట్టింది. 30 దేశాల్లోని 11,266 మంది రోగులకు అందించిన 28 రోజుల చికిత్సను పరిశీలించింది. రెమ్‌డెసివిర్‌ను హైడ్రాక్సీ క్లోరోక్విన్, లోపినావిర్, రిటోనావిర్, ఇంటర్ఫెరోన్ వంటి ఔషధాలతో కలిపి ఇచ్చినప్పుడు వాటి ప్రభావం స్వల్పంగానూ, కొన్ని సమయాల్లో అసలేమీ లేకుండానూ ఉన్నట్టు గుర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఖ్యమంత్రి గారూ.. క్షమాపణలు చెప్పండి.. లేదంటే పదవిపోతుంది: రఘురామకృష్ణ రాజు