Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇసుజు మోటార్స్‌ ఇండియా నుంచి బీఎస్‌ 6 ప్రమాణాలతో కూడిన డీ-మ్యాక్స్‌ రెగ్యులర్‌, ఎస్‌-క్యాబ్‌

ఇసుజు మోటార్స్‌ ఇండియా నుంచి బీఎస్‌ 6 ప్రమాణాలతో కూడిన డీ-మ్యాక్స్‌ రెగ్యులర్‌, ఎస్‌-క్యాబ్‌
, బుధవారం, 14 అక్టోబరు 2020 (21:37 IST)
ఇసుజు మోటార్స్‌ ఇండియా బీఎస్-6 ప్రమాణాలతో కూడిన డీ-మ్యాక్స్‌ రెగ్యులర్‌ క్యాబ్‌ మరియు డీ-మ్యాక్స్‌ ఎస్-క్యాబ్‌లను భారతదేశంలో నేడు ఆవిష్కరించింది. వాణిజ్య వాహన శ్రేణిని విస్తరిస్తూ ఈ కంపెనీ ఇప్పుడు సరికొత్త డీ-మ్యాక్స్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ను 1710 కేజీ పేలోడ్‌తో తమ వాణిజ్య వాహన శ్రేణికి జోడించింది. ఈ నూతన వాహన జోడింపుతో, ఇసుజు మోటార్స్‌ ఇండియా ఇప్పుడు డీ-మ్యాక్స్‌ రెగ్యులర్‌ క్యాబ్‌ హై-రైడ్‌తో ఫ్లాట్‌ డెక్‌; డీ-మ్యాక్స్‌ రెగ్యులర్‌ క్యాబ్-ఛాసిస్‌; ఎస్-క్యాబ్‌ స్టాండర్డ్‌-రైడ్‌ ; ఎస్‌-క్యాబ్‌ హై-రైడ్‌ మరియు నూతన డీ-మ్యాక్స్‌ రెగ్యులర్‌ క్యాబ్‌ సూపర్‌ స్ట్రాంగ్‌లో అందిస్తూ మరింత వైవిధ్యమైన అవకాశాలను అన్ని వ్యాపార మరియు వృత్తిపరమైన అవకాశాలకు అందిస్తుంది.
 
శక్తివంతమైన 2.5 లీటర్‌ ఇసుజు 4జె ఏ1 ఇంజిన్‌తో కూడిన ఈ విస్తృతశ్రేణి వాణిజ్య వాహనాల ప్రాజెక్ట్‌, తమ నూతన శైలి, ఆహ్లాదకరమైన డిజైన్‌తో దూకుడు వైఖరిని ప్రదర్శిస్తుంది. ఈ వాహనాలను దేశంలోని వాణిజ్య వాహన విభాగంలో మొట్టమొదటిసారి అయినప్పటికీ ఎన్నో సరికొత్త ఫీచర్లతో ఆవిష్కరించారు. డీ-మ్యాక్స్‌ రెగ్యులర్‌ మరియు డీ-మ్యాక్స్‌ ఎస్‌ క్యాబ్‌ వాహనాలు స్ల్పాష్‌ వైట్‌ మరియు టైటానియం సిల్వర్‌ కలర్స్‌తో పాటుగా పూర్తి సరికొత్త గాలెనా గ్రే కలర్‌లో లభ్యమవుతాయి. ఈ నూతన డీ-మ్యాక్స్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ ధర 8,38,929 రూపాయలు (ఎక్స్‌ షోరూమ్‌, ముంబై). రాబోతున్న పండుగ సీజన్‌ కోసం మొత్తం డీ-మ్యాక్స్‌ శ్రేణిపై ఆకర్షణీయమైన పరిచయ ధర(పరిమితస్టాక్‌పై)ను సైతం పరిచయం చేయనున్నారు.
 
ఈ తాజా మోడల్స్‌ అదనపు ఫీచర్లు అయిను ఎక్స్‌టీరియర్‌ మరియు ఇంటీరియర్‌ పరంగా జోడించుకుంది. వైవిధ్యమైన ఎక్స్‌టీరియర్‌  డిజైన్‌ మరింత ఏరోడైనమిక్స్‌ ప్రదర్శిస్తుంది. నూతన గ్రిల్‌, బానెట్‌, బంపర్‌డిజైన్స్‌తో ఇది బోల్డర్‌ లుక్‌ను ప్రదర్శిస్తుంది. టర్న్‌ ఇండికేటర్స్‌తో మిళితమైన నూతన హెడ్‌ల్యాంప్‌ డిజైన్‌తో దీనిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
 
ఈ విభాగంలో మొట్టమొదటిసారి అనతగ్గ రీతిలో ఇసుజు తమ రెండు వాహనాల్లోనూ వేరియబల్‌ జియోమెట్రిక్‌ టర్బోచార్జర్‌ను కలిగి ఉంది. ఇది ప్రభావవంతంగా ఇంధనం వినియోగించుకుంటుంది. ఎల్‌ఎన్‌టీ (లీన్‌ నాక్స్‌ ట్రాప్‌), డీపీడీ(డీజిల్‌ పర్టిక్యులర్‌ డిఫ్యూజర్‌) మరియు పీ-ఎస్‌సీఆర్‌ (పాసివ్‌ సెలక్టివ్‌ క్యాటలిస్ట్‌ రిడక్షన్‌) సహా ఆఫ్టర్‌ ట్రీట్‌మెంట్‌ ఉపకరణాల ప్రభావవంతమైన సెట్‌తో కలిసిన ఈ వాహనాలు ప్రభావవంతంగా ఉద్గారాలను, పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ను శుద్ధి చేస్తుంది. ఇసుజు డీ-మ్యాక్స్‌ రెగ్యులర్‌ క్యాబ్‌, ఎస్-క్యాబ్‌ వాహనాలు మాత్రమే ఎలక్ట్రానిక్ పరంగా నియంత్రించే ఈజీఆర్‌ (ఎగ్జాస్ట్‌ గ్యాస్‌ రీసర్క్యులేషన్‌) వ్యవస్థను కలిగి ఉన్నాయి.
 
ఈ రెండు మోడల్స్‌ ఇప్పుడు మిడ్‌ (మల్టీ ఇన్‌ఫర్మేషన్‌ డిస్‌ప్లే) క్లస్టర్‌ను జీఎస్‌ఐ (గేర్‌ షిప్ట్‌ ఇండికేటర్‌)తో కలిగి ఉన్నాయి. ఇది ఎలాంటి డ్రైవింగ్‌ పరిస్థితులలో అయినా డ్రైవర్లు, టార్క్‌, ఇంధన నిర్వహణ, డ్రైవ్‌ట్రైన్‌ డ్యూరబిలిటీ పరంగా సరైన గేర్‌ను వినియోగిస్తున్నారన్న భరోసా కలిగి ఉంటారు.
webdunia
సౌకర్యాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్తూ, డీమ్యాక్స్‌ శ్రేణిలో సీట్లు ఇప్పుడు అత్యున్నత నాణ్యత కలిగిన వస్త్ర అప్‌హోలెస్ట్రీతో వస్తుంది. దీనిలో ఎత్తును సరిచేసుకోతగిన సీట్‌ బెల్ట్స్‌లు ఉన్నాయి. ఇవి వాహనంలో ప్రయాణిస్తున్న వారి సౌకర్యం, భద్రతకు భరోసా అందిస్తాయి. అదనంగా, ఈ విభాగంలో మొట్టమొదటిసారిగా, స్లైడింగ్‌ కో-డ్రైవర్‌ సీట్‌ ఈ నూతన వాహనాలలో ఉండటంతో పాటుగా కో-డ్రైవర్‌కు కూడా సౌకర్యం అందిస్తుంది.
 
అత్యంత ధృడమైన నాణ్యత కలిగిన నిర్మాణాలకు ఇసుజు వాహనాలు సుప్రసిధ్ధం. డీ-మ్యాక్స్‌ క్యాబ్‌, ఎస్-క్యాబ్‌ స్టేలు ఈ గుర్తింపుకు తగినట్లుగా ఉంటాయి. ఈ రెండు వాహనాలూ ఈ శ్రేణిలో అత్యుత్తమంగా వాహనదారుల భద్రతను ముందువెనుకల క్రంపెల్‌ జోన్స్‌; క్రాస్‌ కార్‌ ఫ్రంట్‌ బీమ్‌, డోర్‌ సైడ్‌ ఇంట్రూజన్‌, కొలాప్సబల్‌ స్టీరింగ్‌ కాలమ్‌, అండర్‌ బాడీ స్టీల్‌ ప్రొటెక్షన్‌ను డ్రైవ్‌ట్రెన్‌కు కలిగి ఉంటుంది. అదనంగా, నూతన వాహనాలలో బాస్‌ (బ్రేక్‌ ఓవర్‌ రైడ్‌ సిస్టమ్‌)తో వస్తున్నాయి. ఇది పానిక్‌ బ్రేకింగ్‌ సమయంలో ఇంజిన్‌కు శక్తిని అందించకుండా అడ్డుకుంటుంది (బ్రేక్‌ మరియు యాక్సలరేటర్‌ పెడల్స్‌ను ఒకేసారి వినియోగించినప్పుడు).
 
తమ ధృడమైన డిజైన్‌ మరియుసాటిలేని విశ్వసనీయతతో, ఇసుజు డీ-మ్యాక్స్‌ మరియు డీ-మ్యాక్స్‌ ఎస్-క్యాబ్‌ వాహనాలు అత్యున్నత మన్నిక గలవి మరియు వీటిని 40 లక్షల కిలోమీటర్ల వరకూ విభిన్నమైన భౌగోళిక పరిస్థితులలో పరీక్షించి రూపొందించారు. అభివృద్ధి చెందుతున్న భారతీయ వినియోగదారులకు అత్యంత ప్రాధాన్యత భాగస్వామిగా రోడ్డు మీద ఈ వాహనాలు నిలుస్తాయి.
 
ఈ నూతన వాహనాల ఆవిష్కరణ సందర్భంగా శ్రీ సుగ్యు ఫుకుమురా, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఇసుజు మోటార్స్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘ఇసుజు డీ-మ్యాక్స్‌ మరియు డీ-మ్యాక్స్‌ ఎస్-క్యాబ్‌ ఎల్లప్పుడూ స్థలం, బలం మరియు పనితీరు యొక్క సంపూర్ణమైన కలయికతో  వ్యాపార మరియు జీవితంలో ముందుండేలా తోడ్పడే వాహనాలుగా మా వినియోగదారుల నడుమ నిలిచాయి. ఆధారపడతగిన సాంకేతికత, ఇంజినీరింగ్‌ను భారత మార్కెట్‌కు తీసుకువచ్చేందుకు ఇసుజు వద్ద మేము కట్టుబడి ఉన్నాము. ధృడమైన, విశ్వసనీయమైన మరియు మన్నికైన వాహనాలకు అంతర్జాతీయంగా ఇసుజు ఖ్యాతి గడించింది. నూతన డీ-మ్యాక్స్‌, డీమ్యాక్స్‌ ఎస్‌-క్యాబ్‌లు ఈ లక్షణాలను ప్రదర్శిస్తాయి’’ అని అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ ‘‘ఈ విభాగంలో ఎన్నో నూతన ఫీచర్లు అయినటువంటి వేరియబల్‌ జిమోమెట్రీ టర్బోచార్జర్‌, బ్రేక్‌ ఓవర్‌రైడ్‌ సిస్టమ్‌, గేర్‌ షిప్ట్‌ ఇండికేటర్‌తో నూతన మల్టీ ఇన్‌ఫర్మేషన్‌ డిస్‌ప్లే, ఎలక్ట్రానికల్ నియంత్రించతగిన ఈజీఆర్‌ మరియు స్లైడింగ్‌ కో-డ్రైవర్‌ సీట్‌ సహా ఎన్నో పరిచయం చేస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. సంతృప్తి పొందిన ఎంతోమంది వినియోగదారులు ఇసుజు డీ-మ్యాక్ప్‌ మరియు ఎస్‌–క్యాబ్‌లను ఎంచుకుంటుండటం వల్ల, బీఎస్‌ 6 వాహన శ్రేణి పట్ల కూడా అదే విధమైన ఆదరణ చూపగలరని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.
 
శ్రీ కెన్‌ తకషిమా, డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌-ఇసుజు మోటార్స్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘ఖచ్చితమైన శైలి, శక్తి మరియు రోడ్డుపై ఉనికిని అందించే రీతిలో మా వాహనాలను రూపొందించాం. అదే సమయంలో ఈ వాహనాలు అత్యుత్తమ సౌకర్యం, భద్రతను సైతం అందిస్తాయి. భారతీయ ఆటోమోటివ్‌ మార్కెట్‌ సమూలంగా మారుతుంది. ఈ సమయంలో మా అత్యాధునిక ఆఫరింగ్స్‌తో ఇక్కడ ఉండటం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. బాధ్యతాయుతమైన బ్రాండ్‌గా, నూతన తరపు ఉత్పత్తులను వేగంగా మార్కెట్‌కు తీసుకువచ్చేందుకు మేము చేయాల్సినదంతా చేస్తున్నాం.
 
మా తాజా డీ-మ్యాక్స్‌, డీ-మ్యాక్స్‌ ఎస్-క్యాబ్‌లను తీసుకురావడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇవి బీఎస్-6 ప్రమాణాలను కలిగి ఉండటమే కాదు, మా ఔత్సాహిక వినియోగదారులకు విలువ ప్రతిపాదనను సైతం వృద్ధి చేసే రీతిలో తీర్చిదిద్ది, అభివృద్ధి చేశాం’’ అని అన్నారు. ‘‘డీ-మ్యాక్స్‌ వాహనాలు భారతదేశంలో ఎంతోమందికి విజయాన్ని అందించాయి. ఈ డీ-మ్యాక్స్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ మోడల్‌ సైతం విజయానికి ఖచ్చితమైన భాగస్వామిగా నిలువనుందనే విశ్వాసంతో ఉన్నాం’’ అని ఆయన జోడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవినీతి మంత్రిని జగన్ ఎందుకు కాపాడుతున్నాడు?: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు