భూమి, ఇళ్లు, పెద్ద బంగళాలు, దుకాణాలు దొంగిలించలేని స్థిరాస్తులు. అయితే, కొంతమంది వాటిని అద్దెకి ఇస్తుంటారు. ఆ తర్వాత ఏముందిలే... ఈ ఆస్తులు ఎక్కడికి పోతాయనే అజాగ్రత్త వల్ల అవి సమస్యల్లో పడిపోతాయి. ఎవరైనా మీ ఆస్తిని శాశ్వతంగా ఆక్రమించినట్లయితే లేదా యాజమాన్యాన్ని క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించినట్లయితే, అది ముఖ్యమైన సమస్యను కలిగిస్తుంది. అద్దె ఒప్పంద చట్టాల గురించి చాలామందికి తెలియదు. లా ఆఫ్ అడ్వర్స్ పొసెషన్' అనేది చట్టపరమైన నిబంధన.
ఒక అద్దెదారు లేదా ఎవరైనా ఒక ఆస్తిపై వరుసగా 12 సంవత్సరాల పాటు హక్కును క్లెయిమ్ చేస్తే, కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వవచ్చు. అందువల్ల, యజమానులు తమ ఆస్తులను అద్దెకు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 12 సంవత్సరాల పాటు ఆస్తిలో నివసించిన వ్యక్తి, అద్దెదారుగా ఉన్నప్పటికీ ఆస్తి తమ స్వాధీనంలోనే వుందంటూ యాజమాన్యంపై క్లెయిమ్ చేయవచ్చు.
వారు ఆస్తులను కూడా అమ్మవచ్చు. ఆస్తిని అద్దెకు ఇచ్చేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ అధికారిక అద్దె ఒప్పందాన్ని రూపొందించండి. కాంట్రాక్ట్ 11 నెలల పాటు మాత్రమే వుండేలా నిర్ధారించుకోండి. గడువు ముగిసిన తర్వాత దాన్ని పునరుద్ధరించండి. ఒప్పందంలో ఆస్తికి సంబంధించిన వివరణాత్మక సమాచారాన్ని చేర్చండి, కాలానుగుణంగా అందులో మార్పులు చేస్తుండాలి. ఆస్తులను అద్దెకి ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా న్యాయవాదుల సలహా తీసుకోండి.