Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దాల్మియా సిమెంట్‌ డిజిటల్‌ ప్రచారం- అప్నీ పర్సనల్‌ స్పేస్‌

Advertiesment
Dalmia Cement
, మంగళవారం, 10 నవంబరు 2020 (22:19 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ సిమెంట్‌ బ్రాండ్‌ దాల్మియా సిమెంట్‌ నేడు తమ డిజిటల్‌ ప్రచారం- అప్నీ పర్సనల్‌ స్పేస్‌ను ప్రారంభించింది. కరోనా వైరస్‌ కారణంగా వచ్చిన లాక్‌డౌన్‌లో వినియోగదారుల జీవితాలపై ఇది దృష్టి కేంద్రీకరించింది. ఈ ప్రచారాన్ని రెండు డిజిటల్‌ చిత్రాలు ద్వారా నిర్వహిస్తున్నారు.

రెండు జంటల జీవితాలపై ఇవి దృష్టి కేంద్రీకరించడంతో పాటుగా తమ ప్రస్తుత మరియు భవిష్యత్‌ను ఏ విధంగా చూస్తున్నారు, సవాళ్లతో కలిసి ఏ విధంగా జీవించాలనుకుంటున్నారు మరియు సుదీర్ఘకాలం ఇంటి వద్ద ఆనందాన్ని ఆస్వాదించవచ్చో తెలుపుతారు. ఈ ప్రచారాల ప్రధాన ఉద్దేశ్యం, కలిసి ఉండటం మాత్రమే కాదు, సంతోషంగా ఉండటం, ఇది ఈ కథనాన్ని ముందుకు నడిపిస్తుంది.
 
ప్రమేష్‌ ఆర్య, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, మార్కెటింగ్‌, దాల్మియా సిమెంట్‌(భారత్‌) లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘గడిచిన కొద్ది నెలలు మన జీవితంలో ఒక్క మారు అనతగ్గ అనుభవాలను అందించాయి. మా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రయత్నాల కారణంగా, మేము దేశవ్యాప్తంగా వినియోగదారులు తమ ఇళ్లను ఏ విధంగా భవిష్యత్‌కు సిద్ధంగా మలచాలన్న అంశమై చూస్తున్నారు. మనమంతా కూడా జీవిత నాణ్యతను నూతన విధానంలో ఆలోచిస్తున్నారు. దాల్మియా సిమెంట్‌ యొక్క భవిష్యత్‌ యొక్క వాగ్ధానం నేడు వినియోగదారులు ఈ ఆలోచనను తమ ఇంటి నిర్మాణ ప్రయాణంలో ముందుకు తీసుకువెళ్లేందుకు తోడ్పడుతుంది’’ అని అన్నారు.
 
ఈ క్యాంపెయిన్‌కు నేపథ్యీకరణ చేసిన డిజిటల్‌ ఏజెన్సీ క్రియేటివ్‌ స్ట్రీట్‌- సీఈవో అండ్‌ కో-ఫౌండర్‌, నీరజ్‌ సంచెటి మాట్లాడుతూ, ‘‘ఈ ప్రచారం ద్వారా దాల్మియా సిమెంట్‌ యొక్క అత్యంతకీలకమైన వాగ్ధానం అయినటువంటి ఫ్యూచర్‌ టుడేను తీసుకువస్తుంది. నేటి గృహ నిర్మాణదారుల మారుతున్న అవసరాలను ఇది వెల్లడిచేస్తుంది. అధిక శాతం మంది ప్రజలు ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న వేళ, వ్యక్తిగత ప్రాంగణం అనేది వాస్తవమైందిప్పుడు. ఇది కేవలం పనిపై ప్రభావం చేయడమే కాదు, ప్రతి ఒక్కరి మానసిక ప్రశాంతతకు తోడ్పడుతుంది.  ఈ అంచనాలపైనే, మేము ఈ రెండు చిత్రాలనూ తీర్చిదిద్దడంతో పాటుగా వ్యక్తిగత ప్రాంగణ ఆవశ్యకత చుట్టూ సంభాషణలను ప్రారంభించాం’’ అని అన్నారు.
 
లాక్‌డౌన్‌ కాలంలో మరియు పలు అన్‌లాక్‌ దశలలో, ఈ బ్రాండ్‌ పూర్తిస్ధాయిలో సేవలను వినియోగదారులకు వర్ట్యువల్‌గా అందించడంతో పాటుగా తమ సహాయాన్ని కొనసాగిస్తూనే, కార్మికుల కొరత, స్థానిక లాక్‌డౌన్స్‌ మరియు ఇతర సవాళ్లు వంటివి గృహ నిర్మాణంపై ప్రభావం చూపుతున్న  కాలంలో నిర్మాణాన్ని సైతం ప్రారంభించింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తరువాత, నిర్మాణాలు వేగవంతంగా పలు ప్రాంతాలలో జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా అతి తక్కువగా ఇన్‌ఫెక్షన్‌ ఉన్న ప్రాంతాలలో ఇది కనిపిస్తుంది. చాలా వరకూ మార్కెట్‌లలో కార్మికుల లభ్యత కూడా దీనికి ఎంతగానో దోహదపడింది.
 
ఈ ప్రచారం యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ మరియు ఇతర డిజిటల్‌ మాధ్యమాలపై అందుబాటులో ఉంటుంది మరియు అనుసంధానతను మరింతగా వృద్ధి చేసేందుకు సమగ్రమైన ఇన్‌ఫ్లూయెన్సర్‌ మార్కెటింగ్‌ వ్యూహాన్ని సైతం ప్రారంభిస్తుంది. వినియోగదారులను తమ సొంత అప్నీ పర్సనల్‌ స్పేస్‌ కథలను క్యాంపెయిన్‌  వెబ్‌సైట్‌ మరియు బ్రాండ్‌ యొక్క సోషల్‌ మీడియా ఛానెల్స్‌ ద్వారా తమ భవిష్యత్‌ గృహాలను గురించి తమ కలలను పంచుకోమని కోరుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాళిబొట్టు ధరించిన మహిళలను కుక్కలతో పోల్చిన మహిళా ప్రొఫెసర్