Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిమెంట్‌ డీలర్ల కోసం చెల్లింపు పరిష్కారాలను డిజిటైజ్‌ చేయనున్న పేటీఎం- దాల్మియా సిమెంట్‌

Advertiesment
సిమెంట్‌ డీలర్ల కోసం చెల్లింపు పరిష్కారాలను డిజిటైజ్‌ చేయనున్న పేటీఎం- దాల్మియా సిమెంట్‌
, మంగళవారం, 3 నవంబరు 2020 (17:34 IST)
సుప్రసిద్ధ భారతీయ సిమెంట్‌ బ్రాండ్‌, దాల్మియా సిమెంట్‌ ఇప్పుడు దేశీయంగా అభివృద్ధి చెందిన ఆర్ధిక సేవల వేదిక పేటీఎంతో భాగస్వామ్యం చేసుకుని నగదు రహిత చెల్లింపుల పరిష్కారాన్ని తమ డీలర్లు మరియు రిటైలర్లకు దేశవ్యాప్తంగా అందించనుంది. పరిశ్రమలో మొట్టమొదటిసారిగా చేసుకున్న ఈ భాగస్వామ్యంతో దాల్మియా సిమెంట్‌ డీలర్లు, విస్తృతస్థాయిలో పేటీఎం యొక్క చెల్లింపు పరిష్కారాలను పొందడంతో పాటుగా అత్యంత సులభంగా వారు వినియోగదారుల నుంచి చెల్లింపులను యుపీఐ, పేటీఎం వాలెట్‌ మరియు ఇతర ప్రాచుర్యం పొందిన నాన్‌ క్యాష్‌ పేమెంట్‌ విధానాలను వినియోగించవచ్చు. రాబోయే కాలంలో, ఈ భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా 30 వేలకు పైగా దాల్మియా సిమెంట్‌ డీలర్లు మరియు రిటైలర్లను 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో చేరుకోనున్నారు.
 
భారతీయ ఆర్థిక వ్యవస్థ డిజిటల్‌ లావాదేవీల వైపు మళ్లుతున్న వేళ, కరోనా మహమ్మారి కారణంగా ఈ వేగం మరింత పెరిగింది. దీనికి తోడు కరెన్సీ మార్పిడిని భౌతికంగా మార్చడం వల్ల కలిగే ప్రమాదాలు కూడా దీనికి దోహదం చేస్తున్నాయి. ఇప్పుడు ఎలాంటి క్లిష్టత లేని రీతిలో పేటీఎంను పొందడం ద్వారా వేలాది మంది దాల్మియా సిమెంట్‌ డీలర్లు మరింతగా డిజిటల్‌ ఆర్థిక వ్యవస్ధకు తోడ్పాటునందించనున్నారు.
 
ఈ భాగస్వామ్యం గురించి శ్రీ ప్రమేష్‌ ఆర్య, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌ ఆఫ్‌ మార్కెటింగ్‌, దాల్మియా సిమెంట్‌ (భారత్‌) లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘ఓ కంపెనీగా, డిజిటల్‌ ఫస్ట్‌గా నిలువాలనేది దాల్మియా సిమెంట్‌ ప్రయత్నం. తద్వారా మా డీలర్లు, రిటైలర్లు తమ రోజువారీ వ్యాపార లావాదేవీలను అత్యంత సులభంగా చేసుకునేందుకు సహాయపడాలనుకుంటున్నాం. డిజిటల్‌ చెల్లింపుల ప్రపంచంలో సౌకర్యం, అతి సులభమైన వినియోగాన్ని అందించడంలో పేటీఎం ఎల్లప్పుడూ ముందు ఉంటుంది.
 
ఈ భాగస్వామ్యం ద్వారా, డీలర్‌ కమ్యూనిటీ ఇప్పుడు కాంటాక్ట్‌లెస్‌ మరియు సురక్షిత చెల్లింపులను పేటీఎం వాలెట్‌, యుపీఐ, డెబిట్‌/క్రెడిట్‌ కార్డ్‌ మరియు నెట్‌బ్యాంకింగ్‌ వినియోగించి స్వీకరించేందుకు సహాయపడనున్నాం. ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం, భౌతిక దూరం ఆచరించడంతో పాటుగా నగదు నిర్వహణ తగ్గించడం మరియు ఎక్స్‌పోజర్‌ను గణనీయంగా తగ్గించడం, మరీ ముఖ్యంగా ప్రస్తుత మహమ్మారి వేళ దీనిని ఆచరణాత్మకంగా చేయాలనుకున్నాము. ఈ భాగస్వామ్యం మా బ్రాండ్‌ విశ్వాసం అయిన ‘బ్రింగ్‌ ఫ్యూచర్‌ టుడే’ దిశగా మరో ముందడుగుగా నిలుస్తుంది’’ అని అన్నారు.
webdunia
కుమార్‌ ఆదిత్య, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పేటీఎం మాట్లాడుతూ, ‘‘తమ డీలర్లు మరియు రిటైలర్లకు డిజిటల్‌ చెల్లింపు పరిష్కారాల శక్తిని అందించడం ద్వారా ఆత్మనిర్భర్‌ భారత్‌ నిర్మించే దిశగా తోడ్పడటంలో దాల్మియా సిమెంట్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. పేటీఎం ఆల్‌ ఇన్‌ ఒన్‌ క్యుఆర్‌ ఇప్పుడు ఎస్‌ఎంఈలకు వృద్ధి చోధకంగా నిలువడంతో పాటుగా నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాలలోకి డిజిటల్‌ చెల్లింపులను ఎలాంటి చార్జీలు లేకుండా అనుమతిస్తున్నాం. దేశంలో ఆర్థిక సమ్మిళితం చేసేందుకు సాంకేతికాధారిత పరిష్కారాలను ఆవిష్కరించడం కొనసాగించనున్నాం’’ అని అన్నారు.
 
దాల్మియా సిమెంట్‌ యొక్క డీలర్లు ఇప్పుడు పేటీఎం మర్చంట్స్‌గా కనీస డాక్యుమెంటేషన్‌ వినియోగించి మారవచ్చు. ఒకసారి సంతకం చేస్తే, ఈ డీలర్లు క్యుఆర్‌ కోడ్‌ అందుకుంటారు. దీనిద్వారా వారు నగదు రహిత చెల్లింపులు స్వీకరించవచ్చు. వారు పేమెంట్‌ లింక్‌లను సృష్టించడం లేదా పంచుకోవడంను తమ వినియోగదారులతో కలిసి చేయవచ్చు. తద్వారా భౌతికంగా స్థానిక సిమెంట్‌ స్టోర్లకు ప్రయాణించడమూ నివారించవచ్చు. వీటితో పాటుగా డీలర్లు మరియు రిటైలర్లు ఎలాంటి వార్షిక నిర్వహణ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకపోవడం, జీరో ఫీజులు లేదా జీరో చార్జీలను యుపీఐ, రూపే డెబిట్‌ కార్డ్‌ మరియు పేటీఎం వాలెట్‌ ద్వారా వినియోగదారులు చేసినప్పుడు చెల్లించనవసరం లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రమ్మీ పేకాటను ప్రోత్సహిస్తున్న కోహ్లీ - తమన్నా- రానా??