ఇంట్లో నుంచే బిజినెస్ చేయాలనుందా? అయితే.. నెలకు రూ.20 వేలు వచ్చే ఈ వ్యాపారంపై దృష్టి పెట్టండి. ఈ వ్యాపారం మసాలా మేకింగ్ యూనిట్. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా తక్కువ పెట్టుబడి అవసరం ఉంటుంది. ఎక్కువ ప్రాఫిట్ పొందే అవకాశం ఉంటుంది.
భారతదేశంలోని సుగంధ ద్రవ్యాలకు ముఖ్యమైన స్థానం ఉందని కాబట్టి మసాలా బిజినెస్‌లో బాగా రాణించే అవకాశం వుంది. అయితే నాణ్యత మాత్రం తగ్గకూడదు. దేశంలో మిలియన్ల టన్నుల వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి నుంచి మసాలాలు తయారు చేసి విక్రయిస్తే మంచి లాభాలు పొందొచ్చు.
స్థానికంగా ఉండే ప్రజల ఆహారపు అలవాట్లు, వారి అభిరుచులకు అనుగుణంగా మసాలాలు తయారు చేస్తే ఈ వ్యాపారంలో సక్సెస్ కావొచ్చు. రుచి, మార్కెట్ పై అవగాహన ఉంటే, మసాలా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు.
ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) నివేదికలో, సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు పూర్తి బ్లూప్రింట్ తయారు చేయబడింది. ఈ నివేదిక ప్రకారం.. సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు రూ.3.50 లక్షలు ఖర్చవుతుంది.