Article Finance Articles %e0%b0%b9%e0%b1%80%e0%b0%b0%e0%b1%8b %e0%b0%b8%e0%b1%88%e0%b0%95%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d %e0%b0%b0%e0%b1%82 43 000 112022100046_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరో సైకిల్ @ రూ. 43,000

Advertiesment
హీరో సైకిల్
భారతదేశంలో సైకిల్ అమ్మాకాలల్లో బ్రాండ్ ఇమేజ్‌ను, క్రేజ్‌ను తెచ్చుకున్న సంస్థ "హీరో". ముంజల్ కుటుంబం ప్రమోట్ చేస్తున్న సైకిళ్లు ఇప్పుడు కొత్త హంగులతో విలాసవంతమైన ఖరీదైన సైకిళ్లను రూపుదిద్దుకున్నాయి. 'అర్బన్ ట్రైల్' బ్రాండ్‌తో లగ్జరీ సైకిళ్లను "హీరో" అందిస్తుంది.

కార్బన్ ఫ్రేమ్‌తో తయారు చేసిన 'రెడ్‌ డాట్‌' ప్రీమియం సైకిల్‌ను దేశీయ మార్కేట్‌లోకి విడుదల చేస్తున్నామని హీరో సైకిల్స్ తయారి సంస్థ పేర్కొంది. మార్కెట్లో దీని ధర రూ.43,000. అర్బన్ ట్రైల్ బ్రాండ్‌గా 17 కొత్త మోడళ్లను అందిస్తున్నామని, వీటి ధరలు సుమారు రూ.10,000 నుంచి రూ.43,000 వరకూ ఉన్నాయని కంపెనీ తెలిపింది.

అభివృద్ధి చెందుతున్న నగరాలను, అర్బన్ మార్కెట్లను, ఇంకా విదేశి మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని ఈ లగ్జరీ సైకిళ్లను రూపొందించడం జరిగిందని కంపెనీ పేర్కొంది. ప్రీమియం సైకిళ్ల అమ్మకాల కోసం హీరో సైకిల్స్‌ స్వతహాగా మప్పై అవుట్‌లెట్లను ప్రారభించడానికి సిద్ధమైంది.

"హీరో" విడుదల చేసిన సైకిళ్లు కార్బన్‌ పైబర్‌తో రూపొందించారు. కార్బన్‌ పైబర్‌ ఎక్కువగా ఫార్ములా వన్ (ఎఫ్1) రేస్ కార్లు, విమానాల తయారీలో ఈ తరహా కార్బన్ ఫైబర్‌నే ఉపయోగిస్తారు. కార్బన్‌ పైబర్‌ తేలికగా ఉండటమే కాకుండా ఉక్కు కన్నా ఎక్కవ ధృడంగా ఉంటుంది. అటువంటి కార్బన్‌ పైబర్‌‌తో తయారు చేసిన హీరో రెడ్ డాట్ సైకిల్‌ బరువు కేవలం 12.9 కేజీలు.

Share this Story:

Follow Webdunia telugu