Article Finance Articles %e0%b0%b7%e0%b1%87%e0%b0%b0%e0%b1%8d %e0%b0%85%e0%b0%82%e0%b0%9f%e0%b1%87 %e0%b0%8f%e0%b0%ae%e0%b0%bf%e0%b0%9f%e0%b0%bf 110082600063_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షేర్ అంటే ఏమిటి..?

Advertiesment
షేర్లు
PTI Photo
PTI
ఆర్థిక భాషలో చెప్పాలంటే షేర్ అనేది వివిధ రకాల ఆర్థిక వనరుల సముదాయం. ఉదాహరణకు స్టాక్స్, మ్యూచ్‌వల్ ఫండ్స్, పరిమిత భాగస్వామ్యం ఇలా దీనికి రకరకాల పేర్లున్నాయి. సాధారణంగా షేర్ అనే పదాన్ని స్టాక్ అనే పదానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తుంటారు. వాడుక భాషలో చెప్పాలంటే "షేర్" అంటే "వాటా" అని అర్థం.

ఏదైనా కంపెనీలో షేర్ కొనుగోలు చేస్తే సదరు కంపెనీలో షేర్(వాటా) కొనుగోలు చేసిన వ్యక్తి ఆ కంపెనీలో "పరిమిత భాగస్వామ్యం" లేదా "పాక్షిక భాగస్వామ్యం" కలిగి ఉన్నాడని అర్థం. కంపెనీ ఈ షేర్లను కొనుగోలుదారులకు డాక్యుమెంట్ల రూపంలో ఇస్తుంది. ఈ షేర్లను నేరుగా కంపెనీ నుంచి పొందవచ్చు లేదా దగ్గర్లోని స్టాక్ మార్కెట్‌ల నుంచి కూడా పొందవచ్చు.

ఒక్కసారి షేర్ కొనుగోలు చేసిన తర్వాత ఆ షేర్లను స్టాక్ మార్కెట్‌లో ఇతరులకు (కంపెనీలకు) కొనుగోలు ధర కన్నా అధిక ధరకు విక్రయించటం ద్వారా లాభాలను పొందవచ్చు, కొనుగోలు ధర కన్నా తక్కువ ధరకు విక్రయించాల్సి వచ్చినపుడు నష్టాలు తప్పవు. అలాగే.. కంపెనీ లాభాల బాటలో పయనిస్తే షేర్ కొనుగోలు చేసిన వ్యక్తి కూడా లాభాలను పొందుతాడు. అదే కంపెనీ నష్టాల్లో పయనిస్తే షేర్ కొనుగోలుదారులు కూడా నష్టాలు భరించక తప్పదు.

కంపెనీ షేర్ల ధరలు మదుపుదార్లు(పెట్టుబడి దార్లు) మీద ఆధారపడి ఉంటాయి. అంతే కాని కంపెనీ ఎంత విలువ చేస్తుంది అనే అంశంపై మాత్రం కాదు. ఉదాహరణకు ఏదైనా ఒక కంపెనీ కొత్తగా పెట్టుబడులు పెట్టినా లేదా తమ సంస్థలో కొంత వాటాను మరో సంస్థకు విక్రయించినా, లేదా వేరే ఏవైనా సంస్థలు కొత్తగా ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినా షేర్ల ధరలలో మార్పలు వస్తుంటాయి. దేశీయ మార్కెట్‌లో సదరు కంపెనీపై వచ్చే వార్తలు కూడా షేర్ల ధరలను ప్రభావితం చేస్తాయి.

ఇలా షేర్లు కొనుగోలు చేసే వారి కోసమే స్టాక్ మార్కెట్‌లు ప్రతి మూడు నెలలకు ఒక సారి కంపెనీల నుంచి ఆర్థిక(త్రైమాసిక) ఫలితాలను సేకరించి బహిరంగంగా ప్రకటించడం జరుగుతుంది. ఈ త్రైమాసిక ఫలితాలను గత ఏడాదితో పోల్చి చూసిననపుడు లాభాలు కనుక నమోదై ఉంటే షేర్ల విలువలు పెరగడం, అదే నష్టాలు కనుక నమోదై ఉంటే షేర్ల విలువలు తగ్గడం వంటి పరిణామాలు జరుగుతుంటాయి. మార్కెట్ల ఒత్తిడి, సాధారణ పెట్టుబడిదార్ల నిర్ణయాలు కూడా షేర్ ధరలపై ప్రభావం చూపిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu