Publish Date: Thu, 14 Feb 2008 (20:15 IST)
Updated Date: Thu, 14 Feb 2008 (20:13 IST)
షేర్ మార్కెట్‌కు గురువారం శుభ దినంగా పరిణమించింది. ఆశాజనకమైన ట్రేడింగ్‌తో సెన్సెక్స్ 500 పాయింట్లు పెరిగింది. ఈ పెరుగుదల ప్రభావం రోజంతా కనిపించింది. గురువారంనాటి ట్రేడింగ్‌ను గమనించినట్లయితే మార్కెట్‌లు మదుపుదారులకు శుభవార్తలు మోసుకు వచ్చే దిశగా దూసుకుపోతున్నాయని అర్థమవుతోంది.
గురువారం నాడు 250 పాయింట్ల వద్ద నిఫ్టీ పెరుగుదల నిలిచిపోయింది. చూడబోతే ఈ పురోగతి శుక్రవారం సైతం కొనసాగే అవకాశం ఉంది. శుక్రవారం నాటి మార్కెట్ ప్రారంభంలో 40-50 పాయింట్ల వద్ద నిఫ్టీ కార్యకలాపాలు ప్రారంభం కానుంది. 5250-5260 మధ్య స్థిరమైన ట్రేడింగ్‌ను నిఫ్టీ చవి చూసే అవకాశం ఉంది. 5250-5260 వద్ద స్థిరత్వాన్ని పొందిన పక్షంలో నిఫ్టీ పెరుగుదలను గమనించవచ్చు.
నిఫ్టీకి 5120/5050/5025 స్థాయీల వద్ద మంచి మద్దతు లభించవచ్చు. అదేసమయంలో నిఫ్టీ 5350 స్థాయిని చేరుకున్నట్లయితే నిఫ్టీ 54000 స్థాయిని స్పశించే అవకాశం ఉంది.
శుక్రవారం నాటి ప్రముఖ స్టాకులు: శుక్రవారం నాటి మార్కెట్‌లో రిలయన్స్ పవర్, ఓఎన్‌జీసీ, ఐఓసీ, రిలయన్స్ ఇండియా, జేపీ హైడ్రో, ఐసీఐసీఐ బ్యాంక్, అన్సాల్ ఇన్‌ఫ్రా, ప్రజ్ ఇండ్, హిందూ పెట్రోలపై ఆసక్తి గలవారు తమ దృష్టిని కేంద్రీకరించవచ్చు.