Publish Date: Mon, 18 Feb 2008 (20:53 IST)
Updated Date: Mon, 18 Feb 2008 (20:52 IST)
సోమవారం నాటి ముగింపును ఆధారంగా తీసుకున్నట్లయితే మంగళవారం నాటి మార్కెట్ నిరుత్సాహాన్ని కలిగించే రీతిలో ప్రారంభం కావచ్చు. నిఫ్టీ 5285 స్థాయిని అధిగమించిన పక్షంలో మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంది. ఈ స్థాయి నుంచి నిఫ్టీ దిగువకు చేరుకున్నట్లయితే విక్రయాల ఒత్తిడిని మార్కెట్ ఎదుర్కోవచ్చు.
నిఫ్టీ ప్రతికూలతలు, అనుకూలతలు:
5300/5345/5400 స్థాయిల వద్ద నిఫ్టీ ప్రతికూలతలకు గురి కావచ్చు. 5400 స్థాయిని దాటినట్లయితే మార్కెట్‌లో కొనుగోళ్లు విపరీతంగా చోటు చేసుకుంటాయి. కొనుగోళ్లు సాగుతుండగానే స్వల్పవ్యవధిలోనే నిఫ్టీ 5465/5500 స్థాయిని చేరుకునే అవకాశం ఉంది. 5250/5215/5180 స్థాయిల వద్ద నిఫ్టీకి అనుకూలంగా ఉంటుంది. 5180 దిగువ ప్రాంతంలో విక్రయాల ఒత్తిడి పెరిగి స్వల్పవ్యవధిలోనే నిఫ్టీ 5120/5090 స్థాయిని చేరుకోవచ్చు.
దృష్టి పెట్టవలసిన స్టాకులు : మంగళవారం నాటి మార్కెట్‌లో ఆసక్తి గల మదుపుదారులు జేపీహైడ్రో, డబ్ల్యూడబ్ల్యూఐఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ హింద్, ఇస్పాట్ ఇండ్, ఫిన్‌టెక్ స్టాకులపై దృష్టి పెట్టడం మంచిది.
ఛిద్రమైన పరిస్థితులతో ముగిసిన మార్కెట్
ఛిద్రమైన పరిణామాల మధ్య సోమవారం నాటి మార్కెట్లు నిరాశజనకంగా ముగిసాయి. సూచీలలో అనేకం రుణాత్మకంగా ముగిసాయి. అయితే స్మాల్ కాప్ స్టాక్‌లలో కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో మార్కెట్లు కొంత మేరకు ఊపిరి పీల్చుకున్నాయి. అంతర్జాతీయ సూచీలలో ఆసియా మిక్స్‌డ్ ఫలితాల వద్ద ముగియగా ఐరోపా ట్రేడింగ్ అధికంగా జరిగింది.
స్థిరంగా ప్రారంభమైనప్పటికీ అత్యున్నతమైన స్థాయిల వద్ద కొనసాగడంలో మార్కెట్ వైఫల్యాన్ని చవిచూసింది. బోనస్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటామంటూ ఆశ్చర్యానికి గురిచేసేలా రిలయన్స్ పవర్ చేసిన ఆదివారం నాటి ప్రకటన స్థిరమైన ఓపెనింగ్‌కు ఊతమిచ్చింది. మధ్యాహ్నానికి మార్కెట్ పడిపోయినప్పటికీ ఐరోపా మార్కెట్‌ల మూలంగా చోటు చేసుకునే నష్టాలను ఎదుర్కోవడంలో చాకచక్యంగా వ్యవహరించింది.