Publish Date: Thu, 03 Jul 2008 (19:07 IST)
Updated Date: Thu, 03 Jul 2008 (19:01 IST)
భారతదేశంలో టెలికమ్యూనికేషన్ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా మొబైల్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సెల్యులర్ ఫోనులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆపాదించడంతో వాటిపట్ల ప్రజలు మరింత ఆకర్షితులవుతున్నారు. మొత్తమ్మీద భవిష్యత్ ప్రపంచంలో సెల్ వినియోగదారులను కలిగిన అతిపెద్ద దేశంగా భారత్ అవతరించే అవకాశం వుంది.
ప్రస్తుత గణాంకాలనుబట్టి చూస్తే... 2012నాటికి మన దేశంలో సెల్ మార్కెట్ ఆదాయం 3, 700 కోట్ల రూపాయలకు చేరుకోనుంది. అంతేకాదు మొబైల్ వినియోగదారులు సంఖ్య సుమారు 74 కోట్లకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
అంటే... సెల్‌ఫోన్లను వినియోగించే రెండో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించనుంది. కాగా చైనా ప్రథమస్థానంలో వుంది. మరిన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తే భారత్ మార్కెట్‌కు ఎదురుండదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.