Article Finance Articles %e0%b0%97%e0%b1%83%e0%b0%b9%e0%b0%ae%e0%b1%87 %e0%b0%95%e0%b0%a6%e0%b0%be %e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae 108072800076_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గృహమే కదా స్వర్గసీమ

Advertiesment
గృహమే కదా స్వర్గసీమ ముఖేష్ అంబానీ జెన్నిఫర్ బిల్ గేట్స్ లక్ష్మినివాస్ మిట్టల్
సొంత ఇల్లు నిర్మాణాన్ని చిరకాల స్వప్నంగా వర్ణించారు మన పెద్దలు. ఈ కలల సౌధాన్ని నిర్మించేందుకు కావలసిన ఆర్థిక పుష్టి వుంటే... ఇంద్ర భవనాన్ని తలపించే సౌధాలు మన కళ్లముందు ప్రత్యక్షమవుతాయ్. ప్రపంచంలో అపర కుబేరులుగా పరిగణింపబడే బిల్‌గేట్స్, అనిల్ అంబానీ, లక్ష్మి నివాస్ మిట్టల్ వంటి వ్యాపారవేత్తలు, వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మైఖేల్ జాక్సన్, జెన్నిఫర్ లోపేజ్ వంటివారు తమ కలల సౌధాలకు ఆకృతులిచ్చి... ఔరా అనిపిస్తున్నారు.

సాఫ్ట్‌వేర్ రారాజు బిల్‌గేట్స్ ఇల్లు రాజభవనాన్ని మరిపిస్తుంది. సొంత వ్యవసాయ ఎస్టేట్, ప్రత్యేకమైన టెన్నిస్ కోర్టు, విమానం ల్యాండ్ అయ్యేందుకు కావలసిన ఏర్పాటు... ఇత్యాది ప్రత్యేక సౌకర్యాలతో గేట్స్ గృహం స్వర్గంలా కనిపిస్తుంది. ఇక హాలీవుడ్ గ్లామర్ క్వీన్ జెన్నిఫర్ లోపేజ్ తన ఇంటిని నక్షత్రం ఆకారంలో నిర్మించుకుంది. ఆమె ఇంటిలో అడుగుపెట్టినవారు మరో లోకంలో వున్న అనుభూతికి లోనవాల్సిందే.

ప్రముఖ పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ తనకంటూ ప్రత్యేకంగా 700 ఎకరాల్లో తన కలలకు రూపాన్నిచ్చాడు. అంతా విదేశాలవారేనా... అని నిరుత్సాహపడకండి. మన దేశానికి చెందిన లక్ష్మి నివాస్ మిట్టల్ బ్రిటన్‌లో నిర్మించిన భవన సముదాయం అక్కడ కాకలు తీరిన వ్యాపారవేత్తలనే ఔరా అనిపిస్తోందట. ఇక రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ముంబైలో నిర్మిస్తున్న 33 అంతస్తుల భవనం మన దర్పాన్ని ప్రపంచానికి చాటిచెపుతుంది.

Share this Story:

Follow Webdunia telugu