ఇవాళ్టి మార్కెట్:
నిరాశాజనకంగా ముగియడంతో మార్కెట్‌లకు తీవ్రమైన బలహీనతతో కూడుకున్న పరిస్థితి నెలకొంది. ఆసియా ఖండంలో నాసిక రకం పనితీరును ప్రదర్శించిన మార్కెట్‌లలో భారతీయ మార్కెట్లు సైతం చోటు చేసుకున్నాయి. ట్రేడ్ చివరి అంకంలో మదుపుదారులు భారీ ఎత్తున లాభాల స్వీకరణకు దిగడంతో నిఫ్టీ 6,100 పాయింట్ల కంటె కిందకు పడిపోయింది.
బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్ఎమ్‌సీజీ, పవర్ మరియు క్యాపిటల్ గూడ్ స్టాక్స్ భారీగా నష్టపోయిన వాటి జాబితాలో చేరుకున్నాయి. ట్రేడ్ ప్రారంభంలో అత్యధిక సామర్థ్యాన్ని ప్రదర్శించిన విస్తృతమైన మార్కెట్లు సైతం తమ పాటవాన్ని కోల్పోయాయి. మిడ్‌కేప్ మరియు స్మాల్‌కేప్ సూచిలు నిరాశాజనకంగా ముగిసాయి. మార్కెట్ పూర్తి టర్నోవర్ రూ. 92895.01 కోట్లుగా నమోదైంది.
సంక్షిప్త సమాచారం:
దేశంలో ఇప్పటివరకు భారీ ఐపీఓగా పేరున్న రిలయన్స్ పవర్, ఈరోజున తన ఐపీఓను ప్రారంభించింది. మధ్యాహ్నం 1500 గంటలకే 9.39 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను నమోదు చేసుకుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ కృష్ణా బేసిన్‌లో గల షాలో వాటర్ బ్లాకులో మరొక వాయు నిక్షేపాన్ని కనుగొంది.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కమ్యూనికేషన్ శిక్షణ అందించే నోయిడా ఆధారిత ఎవాల్వ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (ఎవాల్వ్)తో షేర్ కొనుగులు ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా ఎవాల్వ్‌కు సంబంధించిన 47.87% వాటాను హస్తగతం చేసుకునేందుకు ఎన్ఐఐటీ రంగం సిద్ధం చేసుకుంది.
బుధవారం నాటి మార్కెట్:
బుధవారం నాటి మార్కెట్ నిరాశాజనకంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే 6050-6040 పాయింట్ల మధ్య నిఫ్టీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే నిఫ్టీ ట్రేడ్ 6040 కన్నా దిగువన ఉన్న పక్షంలో, నిఫ్టీకి అత్యంత కీలకమైన 6000 -5920 స్థాయికి వచ్చేసరికి మదుపుదారులు భారీ ఎత్తున లాభాల స్వీకరణకు దిగే పరిణామాలను మనం వీక్షించవచ్చు. అదేసమయంలో నిఫ్టీ 6050 స్థాయిని అందుకునే పక్షంలో కొనుగోళ్లను మనం చూడవచ్చు. కొనుగోళ్లు దానిని 6100/6130 వరకు తీసుకువెళ్ళవచ్చు. దీంతో పుంజుకున్న నిఫ్టీ 6180 వరకు చేరుకునే అవకాశం ఉంది.
లోహాలు, ఆటోమోబైల్, పవర్ స్పేస్ మరియు ఐటీ రంగాలలో మదుపుదారులు భారీ ఎత్తున లాభాల స్వీకరణకు దిగే పరిణామాన్ని మనం చూడవచ్చు. రేపటి ట్రేడింగ్‌లో ఎమ్ఆర్‌పీఎల్, రేణుక, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీయా కంపెనీలు ఆశాజనకమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది.