Publish Date: Fri, 10 Aug 2007 (20:20 IST)
Updated Date: Fri, 10 Aug 2007 (19:49 IST)
ఆగస్టు 11 శనివారం మాస శివరాత్రి. సృష్టి స్థితి లయకారుడైన శివునికి అత్యంత ప్రీతపాత్రమైనది ఈ రోజు. కనుక ఈ రోజు ఆ పరమేశ్వరుని భక్తితో పూజించాలి. ఆ భక్త వత్సలుని అభిషేకించి, బిల్వ పత్రాలతో పూజించాలి. దీనితోపాటు ఉపవాసం, జాగరణ చేయటం వల్ల శుభం కలుగుతుంది.
శివుని పూజకు మారేడు, తుమ్మి, జిల్లేడు పువ్వులు, గన్నేరు, ఉత్తరేణి, జమ్మి ఆకులు, నల్లకలువ దళాలు, ఉమ్మెత్త పుష్పము, నల్ల కలువలు వాడాలి. వీటితో పరమేశ్వరుని పూజిస్తే సంతృప్తి చెందుతాడు.
అయితే ఇవి దొరకని వారు భక్తితో ఒక పండును గానీ లేదంటే అవీ దొరకకపోతే పత్రాలు లేదా అక్షతలు గానీ, నీళ్లు గానీ వాడాలని పూజా విధానంలో చెప్పబడింది.