Publish Date: Mon, 27 Aug 2007 (10:09 IST)
Updated Date: Mon, 27 Aug 2007 (10:09 IST)
మలయాళీల పండుగైన ఓనం నేడు (సోమవారం) దేశ వ్యాప్తంగా సంబరంగా జరుగుతోంది. ఈ పండుగను పురస్కరించుకుని దేశంలోని పలు రాష్ట్రాల్లోని మలయాళీలు తమ ఇంటి ముందు రంగు రంగులపూలతో ముగ్గులు వేసుకుని వారం రోజుల ముందు ప్రారంభించిన సంబరాలను నేటితో పూర్తి చేసుకుంటున్నారు.
ఆంధ్ర రాష్ట్రం, తమిళనాడులోని మలయాళీలతో పాటు తదితర రాష్ట్రాల్లోని వారు ఈ పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగను జరుపుకోడానికి పలు రాష్ట్రాల్లోని మలయాళీలు తమ సొంత ప్రాంతాల్లోకి చేరుకున్నారు.
ఇదిలా ఉండగా ఓనం పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎన్డీ.తివారీ, తమిళనాడు గవర్నర్ సుర్జిత్ సింగ్ బర్నాలా, పుదుచ్చేరి గవర్నర్ ముకుత్ మిఠిలతో పాటు పలు రాష్ట్ర గవర్నర్లు రాష్ట్రంలోని మలయాళీ ప్రజలకు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.