కార్తీక మాసంలో వచ్చే ఈ నాగులచవితి రోజున నాగారాధన శ్రేష్ఠమైనది. ఈ రోజున బంగారం, వెండి, కర్ర, మట్టి లేక వారివారి తాహతును అనుసరించి ఐదుపడగల పామును చేయించాలి లేదంటే పసుపు, చందనముతో ఐదు లేదంటే ఏడు పడగల పాము చిత్రాలను గీచి వాటికి విధివిధానంగా సంపెంగ, గన్నేరు, జాజి తదితర పుష్పాలతో పూజించి పాలు, పాయసము నివేదన చేయాలి.
నాగారాధన చేయటం వల్ల స్త్రీలకు గర్భ దోషాలు, లైంగిక అసంతృప్తులు, చెవులు, చర్మానికి సంబంధించిన వ్యాధులు నయమవుతాయని పురాణ వచనం. అంతేకాదు ఈ క్రింది శ్లోకాన్ని ప్రతి నిత్యం పఠించేవారికి సర్పభయం, విషభయాలు ఉండవని చెపుతారు.