Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Nag Panchami 2022: నేడు నాగ పంచమి, ఏం చేయాలి?

Nag Panchami
, మంగళవారం, 2 ఆగస్టు 2022 (09:08 IST)
శ్రావణ మాసంలో వచ్చే 5వ రోజున “ నాగ పంచమి“గా కొంతమంది “గరుడ పంచమి”గా పిలుస్తారు. ఈరోజు మంగళవారం నాగపంచమి. భారతీయ సంస్కృతిలో “నాగ పూజ“కి ఒక గొప్ప విశిష్టత మరియు సంప్రదాయముగా ఆచరణలో ఉంది. నాగ పంచమి ప్రాముఖ్యతని సాక్షాత్ పరమ శివుడే స్కంద పురాణములో వివరించాడు.

 
శ్రావణ శుద్ధ పంచమి నాడు చేసే నాగ పంచమి అత్యంత విశిష్టతను సంతరించుకుంది. అందుకు కారణము ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు ఆదిశేషుడు “తాము ఉద్బవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని'' వరం కోరుకున్నాడు. ఆదిశేషుని కోరికని మన్నించి మహా విష్ణువు ఈ నాగుల పంచమి రోజు సర్ప పూజలు అందరూ చేస్తారని వరాన్ని ఇస్తాడు.

 
నాగ పంచమి రోజు నాగులని పూజించి, గోధుమతో చేసిన పాయశాన్ని నైవేద్యముగా పెడతారు. నాగ పంచమి రోజు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనము చేస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతలను పూజించినవారికి "విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః, న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్ "ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పొయ్యాలి. నాగ పంచమి రోజున పూజ చేసిన వారికి విష భాధలు ఉండవు.

 
సర్ప స్తోత్రాన్ని ప్రతిరోజు మరియు నాగ పంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు లేక రోగాలు రావు. వంశము అభివృద్ధి అవుతుంది. సంతానోత్పత్తి కలుగుతుంది. కార్యసిద్ధి జరుగుతుంది. అన్ని కార్యములు సవ్యంగా నెరవేరతాయి. కాలసర్ప దోషాలు, నాగ దోషాలు ఉన్నా తొలగిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

02-08-2022 సోమవారం దినఫలాలు - కార్తీకేయుడిని పూజించినా...