Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బతుకమ్మ పండుగకు కారణమైన కథ ఇదే.. రాజు.. చిన్న కోడలు

Advertiesment
bathukamma festival
, మంగళవారం, 10 అక్టోబరు 2023 (18:28 IST)
బతుకమ్మ పండుగకు కారణమైన కథ ఒకటి ప్రాచుర్యంలో వుంది. ఓ రాజు.. ఆ రాజుకు ఓ చిన్న కోడలు. వారి ఊరికి జీవనాధారం చెరువు. ఎంతో విశాలమైన ఆ చెరువు వానలు బాగా పడటంతో మత్తడి దుంకుతుంది. ఎడతెరపి లేని వానల వల్ల చెరువు నిండి కట్టకు గండిపడుతుంది. 
 
గండిని పూడ్చేందుకు ఊరంతా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే చెరువు కట్ట కంటే అక్కడ మైసమ్మ కొలువు ఉంటుందని చాలా విశ్వాసం. ఆమె చెరువుగా రక్షణగా వుంటుందని భావిస్తారు. అందుకే కట్ట నిలవాలంటే మైసమ్మను శాంతింపచేయాలని రాజు, ప్రజలు భావిస్తారు. కట్టను నిలిపేందుకు తన బర్రెల మందను ఇస్తానని రాజు మైసమ్మను వేడుకుంటాడు. 
 
ఇందుకు బదులుగా మైసమ్మ తల్లి తనకు కూడా బర్రెల మంద వుందని సమాధానమిస్తుంది. ఆవుల మంద, గొర్రెల, మేకల మంద.. ఇలా ఏది ఇస్తానన్నా అవన్నీ తన దగ్గర కూడా వున్నాయని చెప్తుంది. దీంతో ఆ రాజు .. తమ ఊరి బాగు కోసం తన కుటుంబ సభ్యులను అర్పిస్తానని ఆమెకు చెప్తాడు. కానీ ఆ గ్రామ దేవత శాంతించదు. 
 
ఎటూ పాలుపోని స్థితిలో ఆ రాజు చిన్న కోడల్ని ఇస్తానని చెప్పడంతో మైసమ్మ సంతోషించింది. దీంతో కట్ట తెగకుండా ఆగుతుంది. ఇచ్చిన మాటను ఆ రాజు నిలబెట్టాలనుకుంటాడు. కానీ చిన్న కోడలుకు ఈ విషయం తెలియదు. అలా ఆమెను చెరువులోకి దించుతాడు. 
 
అలా మరింత లోతుకు వెళ్లిన ఆమె చెరువులో మునిగిపోతుంది. ఎక్కడైతే ఆ రాజు చిన్నకోడలు మునిగిందో అక్కడ పువ్వులన్నీ నీళ్లల్లో తేలుతాయి. ఊరికోసం ప్రాణాలు అర్పించిన ఆ ఆడబిడ్డ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ.. బతుకమ్మ రూపంలో ఆమె కలకాలం తమతోనే వుంటుందని.. పూలతో ఆమెను పూజించుకుంటామని ఊరివాళ్లంతా చెప్పినట్లు కథ సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బతుకమ్మ జాతర.. తొమ్మిది రోజులు.. తొమ్మిది నైవేద్యాలు