Article Fengshui %e0%b0%97%e0%b1%83%e0%b0%b9%e0%b0%82 %e0%b0%b2%e0%b1%8b%e0%b0%aa%e0%b0%b2 %e0%b0%9f%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%b2%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81 107052400036_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గృహం లోపల టాయిలెట్లు

Advertiesment
గృహం టాయిలెట్లు
ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, జనాభా పెరగటం మూలంగా టాయ్‌లెట్లను గృహ ఆవరణలో నిర్మించుకోవడం జరుగుతోంది. గృహం లోపల నిర్మించే టాయ్‌లెట్లను గృహానికి పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయ దిశలలో నిర్మించుకోవచ్చు. బెడ్‌రూమ్ ఉత్తరం నిర్మించే టాయిలెట్లకు ఉత్తరం లేదా ఉత్తర ఈశాన్యంలో ద్వారం పెట్టాలి. టాయిలెట్ల ఫోరింగులు బెడ్‌రూమ్ ఫోరింగులుకు సమానంగా ఉండాలి.

బెడ్‌రూమ్‌కి దక్షిణాన నిర్మించే టాయ్‌లెట్లను దక్షిణ ఆగ్నేయంలో ద్వారం పెట్టి బెడ్ రూమ్ ఫ్లోరింగు కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించాలి. టాయ్‌లెట్లను నిర్మించే డ్రైనేజీ పైపులు నైరుతి నుంచి బయటకు పెట్టకుండా గృహానికి పశ్చిమం వైపు పెట్టాలి. బెడ్‌రూమ్‌కు పశ్చిమంలో ఉన్న టాయ్‌లెట్లను పశ్చిమ వాయువ్యంలో ద్వారం పెట్టాలి. బెడ్‌రూమ్ కంటే వీలయినంత ఎత్తులో టాయ్‌లెట్లను ఫ్లోరింగు ఉండాలి.

నైరుతి దిక్కున ఉన్న బెడ్ రూమ్‌కు దక్షిణ,పశ్చిమంలో టాయిలెట్ పెట్టడం చాలా సమస్యతో కూడుకున్న వ్యవహారం. టాయ్‌లెట్లలో డ్రైనేజీ పైపులు నిర్మించేటప్పుడు నైరుతి దిక్కు నుంచి బయటకు పెట్టకుండా గృహానికి పశ్చిమం వైపు నుంచి బయటకు పెట్టాలి. అదేవిధంగా బాత్‌రూమ్ ఫ్లోరింగ్, బెడ్ రూమ్ కంటే ఎక్కువ ఎత్తులో పెట్టుకోవాలి. డ్రైనేజీ పైపులు నైరుతి నుంచి కాకుండా దక్షిణం నుంచి బయటికి వళ్ళేలా జాగ్రత్త పడాలి.

టాయ్‌లెట్లలో ఫ్లోరింగ్ వాటం కలిగిన టాయ్‌లెట్లు ఈశాన్యం దిక్కున ఉండాలి. నీరు ఈశాన్యం నుంచి భూమిలోపల ద్వారం గూండా బయటికి వళ్ళే విధంగా చూసుకోవాలి. ఈవిధంగా గృహం లోపల టాయ్‌లెట్లు నిర్మించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం.

Share this Story:

Follow Webdunia telugu