Article Fast Food %e0%b0%b9%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be %e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%80%e0%b0%b2%e0%b1%81 108031400027_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హల్వా పూరీలు

Advertiesment
కావలిసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ - కప్పు
FileFILE
కావలిసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ - కప్పు, నెయ్యి - పావు కప్పు, నీళ్లు - రెండున్నర కప్పులు, యూలకులు - మూడు, మైదా - ఒకటిన్నర కప్పులు.

తయారు చేయు విధానం :
ముందుగా మైదా పిండిలో నీళ్లు పోసి నూనె వేసి కలిపి గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. దానిని కాసేపు నాననిస్తుండాలి. బాణాలిలో కాస్త నెయ్యి వేసి బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించాలి. ఓ గిన్నెలో నీళ్లు పోసి కాచాలి. అలి కాగాక అందులో వేయించిన బొంబాయి రవ్వను వేసి మాట కుండా తిప్పుతూ ఉడికించాలి. ఇందులో కావలిసినంత పంచదార, నెయ్యి, యాలకులను పొడి చేసి వేయాలి. ఇవన్నీ కలిసి ముద్దయ్యేంత వరకు ఉంచి దించేయాలి.

ఆ తర్వాత ఆరబెట్టి చిన్న ఉండలుగా చేసుకోవాలి. మరో వైపు బాణాలిలో నూనె వేసి కాచాలి. చేతికి కాస్త నూనె రాసుకుని కలిపి పెట్టుకున్న మైదాపిండిని చేతితో గుండ్రంగా చేయాలి. ఇందులో ఆ బొంబాయి రవ్వ ఉండను పెట్టి పైన మూసి ప్లాస్టిక్ కవర్‌పై పెట్టి గుండ్రంగా ఒత్తి కాగిన నూనెలో వేయించి దించాలి.

Share this Story:

Follow Webdunia telugu