Publish Date: Fri, 09 Jan 2009 (11:00 IST)
Updated Date: Fri, 09 Jan 2009 (10:58 IST)
కావలసిన పదార్థాలు :
సెనగ పిండి... 200 గ్రాములు
బియ్యం పిండి... 30 గ్రాములు
అల్లం... ఒక ముక్క
కొత్తి మీర... ఒక కట్ట
జీడి పప్పు పలుకులు ... కాసిన్ని
కరివేపాకు, ఉప్పు... తగినంత
ఉల్లిపాయలు... రెండు
నూనె... వేయించేందుకు సరిపడా
ఇంగువ... కాస్తంత
తయారీ విధానం :
సెనగపిండిలో తరిగిన కొత్తిమీర, ఉల్లిపాయలు, ఇంగువ నీరు, అల్లం పేస్టు, జీడిపప్పులు, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి... అన్నింటిని పకోడీ పిండిలాగా చేసుకోవాలి. ఇందులో బియ్యం పిండిని కలుపుకోవడం మర్చిపోవద్దు.
తరువాత బాణలిలో నూనె పోసి, వేడయ్యాక పైన కలుపుకున్న పకోడీల పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా నూనెలో వేయాలి. బాగా వేగి బ్రౌన్ కలర్ వచ్చాక పకోడీలను నూనెలోంచి బయటకు తీసేయాలి. అంతే స్మాల్ పకోడా రెడీ అయినట్లే...!
ఈ స్మాల్ పకోడాను రైస్‌తో పాటు కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే వీటిని విడిగా తినేటట్లయితే గ్రీన్ చట్నీ లేదా సాస్‌తో పాటు కలిపి తినవచ్చు.