కావలసిన పదార్థాలు :
సోయా గుళికలు (చంక్స్)... అర కప్పు
శెనగపిండి... అర కప్పు
పెరుగు... అర లీ.
వేయించిన వేరుశెనగపప్పు పొడి... మూడు టీ.
కారం... చిటికెడు
పంచదార... చిటికెడు
పచ్చిమిర్చి తరుగు... రెండు టీ.
కొత్తిమీర తరుగు... రెండు టీ.
ఉప్పు... తగినంత
నూనె... సరిపడా
ఆవాలు, జీలకర్ర, మెంతులు... పోపుకు సరిపడా
తయారీ విధానం :
ముందుగా సోయా గుళికల్ని ఐదు నిమిషాలపాటు నీళ్ళలో నానబెట్టి, ఆ తరువాత నీటిని వంపేయాలి. శెనగపిండిలో కారం, ఉప్పు వేసి కాస్త జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో సోయా గుళికలను ముంచి వడల్లాగా మాదిరిగా కాగుతున్న నూనెలో వేసి వేయించి తీసేయాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో ఉంచిన పెరుగులో ఈ వేడి వేడి సోయా వడలను వేసి.. అందులోనే వేరుశెనగపొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పంచదార, కరివేపాకు, ఉప్పు వేసి కలపాలి. చివరగా మెంతులు, జీలకర్ర, ఆవాలతో చేసిన పోపును కూడా ఈ మిశ్రమంలో కలిపినట్లయితే... సోయా మసాలా పెరుగు వడ తయారైనట్లే...!!