Publish Date: Wed, 28 Jan 2009 (18:22 IST)
Updated Date: Wed, 28 Jan 2009 (18:21 IST)
కావలసిన పదార్థాలు :
పచ్చిమిర్చి... నాలుగు
అల్లం... చిన్న ముక్క
మినప్పప్పు.. ఒక టీస్పూన్
నూనె, ఆవాలు, జీలకర్ర... తాలింపుకు సరిపడా
ఉప్పు... తగినంత
సగ్గుబియ్యం...250 గ్రాములు
తయారీ విధానం :
ముందుగా సగ్గుబియ్యంను శుభ్రం చేసి, బాగా కడిగి, గంటసేపు నానబెట్టి ఉంచుకోవాలి. ఆ తరువాత స్టవ్‌పై బాణలి పెట్టి, వేడయ్యాక తగినంత నూనె పోసి... కాగిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు పెట్టుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయల తరుగు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి బాగా వేయించాలి.
ఇప్పుడు పై వాటితో పాటు నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని కూడా కలిపి వేయించి, తగినంత ఉప్పు వేసుకోవాలి. కాసేపు మూతపెట్టి ఆవిరిమీద ఉడికించిన తరువాత దించేయాలి. అవసరం అనుకుంటే కొత్తిమీర తరుగులను పైన చల్లుకోవచ్చు. అంతే సాబుదాన్ కిచిడీ రెడీ అయినట్లే..! ఈ కిచిడీకి గ్రీన్ చట్నీ లేదా పల్లీల చట్నీని సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.