Publish Date: Fri, 09 Jan 2009 (11:00 IST)
Updated Date: Fri, 09 Jan 2009 (11:00 IST)
కావలసిన పదార్థాలు :
పనీర్... 200 గ్రాములు
పచ్చడి కోసం...
కొత్తిమీర... ఒక కప్పు
నిమ్మరసం... ఒక కాయది
అల్లం, కారం పేస్ట్... ఒక టీస్పూన్
ఉప్పు... సరిపడా
జీడిపప్పు పలుకులు... 4 టీస్పూన్లు
గరంమసాలా... అర టీస్పూన్
వెన్న... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం :
చట్నీకి కావలసిన పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. పనీర్‌ను చతురస్త్రాకారంగా మీడియం సైజులో ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఈ పనీర్ ముక్కలు రెండింటి మధ్య పైన రుబ్బుకున్న చట్నీని ఉంచి బ్రెడ్ ముక్కల్లాగా అతికించాలి.
అలా మొత్తం పనీర్ ముక్కలను చేసుకున్న తరువాత... స్టవ్‌పైన నాన్‌స్టిక్ పెనం పెట్టి... పనీర్ ముక్కలను ఉంచి సన్నటి సెగమీద బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే శాండ్‌విచ్ పనీర్ సిద్ధమైనట్లే...! వీటిని వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి.