Article Fast Food %e0%b0%b6%e0%b0%a8%e0%b0%97%e0%b0%aa%e0%b0%bf%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf %e0%b0%a1%e0%b1%88%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d 108122700041_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శనగపిండి డైమండ్స్

Advertiesment
వంటకాలు ఫాస్ట్ఫుడ్ శనగపిండి పసుపు పచ్చిమిర్చి తరుగు అల్లం ఉప్పు పంచదార నూనె పెరుగు నీరు ఫ్రూట్సాల్ట్ ఆవాలు
ND
కావలసిన పదార్థాలు :
శనగపిండి... వంద గ్రాములు
పసుపు... అర టీస్పూన్
పచ్చిమిర్చి తరుగు... ఒక టీస్పూన్
అల్లం తరుగు... రెండు టీస్పూన్లు
ఉప్పు... రుచికి సరిపడా
పంచదార... ఒక టీస్పూన్
నూనె... ఒక టీస్పూన్
పెరుగు... అర కప్పు
నీరు... అర కప్పు
ఫ్రూట్ సాల్ట్... ఒక టీస్పూన్

తాలింపుకు :
నూనె... ఒక టీస్పూన్
ఆవాలు... అర టీస్పూన్
ఇంగువ... పావు టీస్పూన్
కరివేపాకు... కొద్దిగా
పచ్చిమిరపకాయలు... మూడు
అలంకరణకు కొబ్బరి తురుము... 50 గ్రాములు
కొత్తిమీర... కొద్దిగా

తయారీ విధానం :
ఒక పాత్రలో శనగపిండి, పసుపు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు, పంచదార, నూనె వేసి అందులో పెరుగు పోసి బాగా కలిపి, గిలకొట్టి ఉంచుకోవాలి. ఫ్రూట్ సాల్ట్‌ను నీటిలో నానబెట్టి, పిండి మిశ్రమంలో పోసి అరగంటసేపు నానబెట్టాలి.

నూనె రాసిన పాత్రలోకి పిండిని మార్చుకుని, ఈ గిన్నెను కుక్కర్ లేదా స్టీమర్‌లో ఉంచి ఆవిరిపైన 20 నిమిషాలపాటు ఉడికించాలి. తరువాత కిందికి దించేసి ఆరనిచ్చి, పిండిని డైమండ్స్ ఆకారంలో ముక్కలుగా కోసుకోవాలి.

ఇప్పుడు మూకుడులో నూనె వేసి, వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడిన తరువాత అందులో ఇంగువ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఒక నిమిషంపాటు వేగిన తరువాత అందులో ఒక కప్పు నీరు పోసి నీరు బాగా మరిగిన తరువాత అందులో కట్ చేసి ఉంచుకున్న శనగపిండి ముక్కలను వేసి జాగ్రత్తగా కలిపి ఉడికించాలి.

నీరు బాగా ఇగిరిపోయిన తరువాత పైన కొత్తిమీర, కొబ్బరితురుము చల్లాలి. అంతే వేడి వేడి శనగపిండి డైమండ్స్ రెడీ అయినట్లే..! వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. డైమండ్స్ ఆకారంలో, చూడ్డానికి కలర్‌ఫుల్‌గా ఉన్న వీటిని తినేందుకు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కూడా..!

Share this Story:

Follow Webdunia telugu