Publish Date: Thu, 10 Jul 2008 (18:09 IST)
Updated Date: Thu, 10 Jul 2008 (18:08 IST)
కావలసిన పదార్థాలు :
బీన్స్,క్యారెట్, ఉల్లికాడల తరుగు... చెరో 1/2 కప్పులు
బాస్మతి రైస్... రెండు కప్పులు
వెనిగర్... నాలుగు టీ స్పూన్లు
సోయాసాస్... 2 టీ స్పూన్లు
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
రైస్‌కు నాలుగు స్పూన్ల నూనెను పోసి నాలుగు కప్పుల నీటితో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలి వేడయ్యాక నూనెను పోసి అందులో వెజిటేబుల్ తరుగులను చేర్చి, ఉడికించిన రైస్‌ను కలుపుకుని బాగా వేయించాలి. ఇందులో వెనిగర్ సోయాసాస్, ఉప్పు చేర్చాలి. కొద్ది సేపటి తరువాత రైస్ ముద్దలా అవకుండా చూసుకుని దించేయాలి. అంతే ఫ్రైడ్ రైస్ రెడీ. దీనికి పెరుగు చట్నీలేదా వెజిటబుల్ కుర్మాను సైడ్ డిష్‌గా వాడుకోవచ్చు.