కావలసిన పదార్థాలు :
ఉప్పుడు బియ్యం... రెండు కప్పులు
నెయ్యి... వేయించేందుకు సరిపడా
ఎర్ర కందిపప్పు... 200 గ్రా.
మినప్పప్పు... అర కప్పు
ఎండుమిర్చి... ఎనిమిది
ఇంగువ... అర టీ.
ఉప్పు... తగినంత
క్యారెట్ తురుము... నాలుగు టీ.
క్యాబేజీ తురుము... నాలుగు టీ.
ఉల్లి తురుము... నాలుగు టీ.కొత్తిమీర తురుము... అర కప్పు
తయారీ విధానం :
బియ్యం, కందిపప్పు, మినప్పప్పులను కలిపి 20 నిమిషాలు నానబెట్టాలి. వీటికి ఎండుమిర్చి, ఇంగువ, ఉప్పు చేర్చి మరీ మెత్తగా కాకుండా గారెల పిండిలాగా రుబ్బుకోవాలి. ఇందులో సన్నగా తురిమిన కూరగాయలు, ఉల్లితురుము, కొత్తిమీరనీ వేసి బాగా కలపాలి.
నాన్‌స్టిక్ పాన్‌ను వేడిచేసి పిండిని గారెమాదిరిగా చేతిమీద గానీ, ప్లాస్టిక్ కవర్‌మీద గానీ వత్తి... కాలుతున్న పాన్‌లో వేసి, అర టీస్పూన్ నేతిని దోసె చుట్టూ వేసినట్లుగా వేయాలి. రెండువైపులా ఎర్రగా కాలిన తీసేయాలి. అంతే వేడి వేడి వెజిటబుల్ గీ అడై సిద్ధమైనట్లే..! దీన్ని కొబ్బరిచట్నీతో కలిపి తించే చాలా రుచిగా ఉంటుంది.