Publish Date: Tue, 12 Aug 2008 (16:54 IST)
Updated Date: Tue, 12 Aug 2008 (16:54 IST)
కావలసిన పదార్థాలు :
టొమోటో... ఒకటి
బంగాళాదుంప... ఒకటి
దోసకాయ...ఒకటి
మిరియాలపొడి... పావు టీ స్పూను
ఉప్పు... సరిపడా
ఫ్రెంచి డస్సింగ్... 2 చెంచాలు
క్యారెట్ తురుము... 2 చెంచాలు
ఉల్లిపాయ సన్నగా తరిగినది... 4 చెంచాలు
తయారీ విధానం :
బంగాళాదుంప ఉడికించి ముక్కలు చేయాలి. పైన చెప్పిన మిగతా అన్నిరకాల ముక్కలను కూడా తురిమి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో బంగాళాదుంప ముక్కలు, తురిమి ఉంచుకున్న ముక్కలను వేసి... మిరియాల పొడి, ఉప్పు కలిపి గంటసేపు ఉంచాలి. ఆ తరువాత డ్రస్సింగ్ వేసి కలిపి ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అయిన తరువాత చల్లచల్లగా అతిథులకు అందించండి.