Publish Date: Wed, 16 Jul 2008 (13:49 IST)
Updated Date: Wed, 16 Jul 2008 (13:49 IST)
కావలసిన పదార్థాలు :
మైదాపిండి... ఒక కప్పు
మెంతిపొడి... రెండు టేబుల్‌స్పూన్లు
ఉప్పు... ఒక టీస్పూన్
నూనె... వేయించేందుకు సరిపడా
వాము... అర టీస్పూన్
ఛాట్ మసాలా... చల్లడానికి కాస్తంత
తయారీ విధానం :
ముందుగా మైదాపిండిలో మెంతిపొడి, వాము, ఉప్పు, రెండు టీస్పూన్ల నూనె వేసి తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. నిమ్మకాయ సైజంత పిండిని తీసుకుని పలుచగా వత్తుకుని కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. వీటిని బాగా కాగుతున్న నూనెలో వేసి కరకరలాడేలా వేయించి తీసేయాలి. చల్లారిన తరువాత వాటిపై ఛాట్ మసాలా చల్లి అతిథులకు సర్వ్ చేయాలి.