Article Fast Food %e0%b0%ae%e0%b1%86%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf %e0%b0%aa%e0%b0%95%e0%b1%8b%e0%b0%a1%e0%b1%80%e0%b0%b2%e0%b1%81 108072200075_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెంతి పకోడీలు

Advertiesment
వంటకాలు ఫాస్ట్ ఫుడ్ మెంతి పకోడీలు సెనగపిండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి
కావలసిన పదార్థాలు :
సెనగపిండి... ఒక కప్పు
తరిగిన ఉల్లిపాయలు... అరకప్పు
పచ్చిమిర్చి... ఒక టేబుల్‌స్పూన్
తరిగిన మెంతి ఆకులు... సగం కప్పు
పనీర్... రెండు టేబుల్‌స్పూన్లు
సోంపు... ఒక టీస్పూన్
కారం... అర టీస్పూన్
పెరుగు... రెండు టేబుల్‌స్పూన్లు
వంటసోడా... చిటికెడు
నూనె... వేయించడానికి సరిపడా
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
సెనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మెంతి ఆకులు, పనీర్, సోంపు, కారం, పెరుగు, వంటసోడాలను ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి.

నూనె కాగిన తరువాత అందులో కలిపిన పిండిని చిన్న చిన్న పకోడీల్లాగా వేసుకోవాలి. సన్నటి మంటమీద బంగారువర్ణం వచ్చేదాకా వీటిని వేయించి తీయాలి. వేడి వేడిగా, కొబ్బరి చట్నీతో వీటిని తింటే భలే రుచిగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu