Article Fast Food %e0%b0%ae%e0%b0%bf%e0%b0%a8%e0%b0%aa %e0%b0%ac%e0%b1%8b%e0%b0%82%e0%b0%a1%e0%b0%be 108081400047_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మినప బోండా

Advertiesment
వంటకాలు ఫాస్ట్‌ఫుడ్ మినప్పప్పు నూనె పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కొత్తిమీర ఉప్పు
WD PhotoWD
కావలసిన పదార్థాలు :
మినప్పప్పు... పావు కిలో
నూనె... పావు కిలో
పచ్చిమిర్చి... 10
అల్లము... చిన్నముక్క
జీలకర్ర... ఒక టీస్పూను
కొత్తిమీర... ఒక కట్ట
ఉప్పు... సరిపడా
ఉల్లిగడ్డలు... రెండు

తయారీ విధానం :
మినప్పప్పును ఒక గంటసేపు నీళ్ళలో నానబెట్టి నీళ్ళు వార్చి రోట్లో వేసి మెత్తగా అయ్యేలా నీళ్ళు చల్లుతూ రుబ్బాలి. రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం కడిగి సన్నగా ముక్కలు తరిగి, రుబ్బిన మినప్పిండిలో సరిపడా ఉప్పుతో కలపాలి. జీలకర్ర కూడా వేసి బాగా కలపాలి.

కళాయి పొయ్యిమీద పెట్టి పావు కిలో నూనె పోసి బాగా మరుగనిచ్చి... రుబ్బిన మినప్పిండిని చిన్న చిన్న ఉండలుగా వేసి అటూ, ఇటూ బంగారు రంగు వచ్చేదాకా వేగనిచ్చి తీయాలి. ఈ మినపబోండా వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. వీటిని అల్లం పచ్చడితో నంజుకుని తింటే బాగుంటాయి.

Share this Story:

Follow Webdunia telugu