Publish Date: Fri, 09 Jan 2009 (10:54 IST)
Updated Date: Fri, 09 Jan 2009 (10:53 IST)
కావలసిన పదార్థాలు :
కుక్కర్‌లో ఉడికించిన రాజ్‌మాలు... అరకప్పు
మైదా... ఒకటిన్నర కప్పు
కొత్తిమీర... పావు కప్పు
కారం... అర టీస్పూన్
నూనె... ఒక టీస్పూన్
ఎండబెట్టిన మామిడిపొడి... అర టీస్పూన్
ఉప్పు... సరిపడా
ఉల్లిపాయ తరిగినది... ఒకటి
మిరియాలపొడి... కాస్తంత
తందూరి మసాలా... అర టీస్పూన్
జీలకర్ర పొడి... అర టీస్పూన్
తయారీ విధానం :
ఉడికించి పక్కన పెట్టుకున్న రాజ్‌మాలలోని నీటిని వంపేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మైదాతో పాటు పైన చెప్పుకున్న పదార్థాలన్నింటిని మెత్తగా పూరీ పిండిలాగా ముద్ద చేసుకోవాలి. ఈ ముద్దలోంచి పిండి కొద్ది కొద్దిగా తీసి పూరీల్లాగా వత్తుకుని, బాగా కాగుతున్న నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చేదాకా రెండువైపులా కాల్చి తీసేయాలి. అంతే మసాలా రాజ్‌మా పూరీలు రెడీ అయినట్లే..! చిన్నపిల్లలు బాగా ఇష్టపడే ఈ పూరీలను సైడ్ డిష్ ఏమీ లేకుండానే లాగించేయవచ్చు. మీరూ ప్రయత్నించండి మరి...!