Publish Date: Mon, 19 Jan 2009 (16:10 IST)
Updated Date: Mon, 19 Jan 2009 (16:10 IST)
కావలసిన పదార్థాలు :
టమోటోలు... 150 గ్రాములు
మినప్పిండి... 6 గరిటెలు
ఉప్పు... సరిపడా
కస్టర్డ్ పౌడర్... 2 గరిటెలు
పచ్చిమిరపకాయలు... ఆరు
మిరియాలపొడి... అర టీస్పూన్
అల్లం... ఒక అంగుళం ముక్క
కొత్తిమీర... ఒక కట్ట
నూనె... వంద గ్రాములు
తయారీ విధానం :
ముందుగా మినప్పిండిలో కస్టర్డ్ పౌడర్ కలిపి, కొద్దిగా నీళ్లు పోసి అట్టు పోసేందుకు వీలుగా ఉండేటట్లు కలుపుకోవాలి. దాంట్లోనే ఉప్పు, మిరియాలపొడి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేయాలి.
ఇప్పుడు స్టవ్‌పై అట్ల పెనం పెట్టి, నూనె పూసి పైన కలిపి ఉంచుకున్న మినప్పిండి మిశ్రమాన్ని అట్లలాగా పోయాలి. ఆ అట్టు కాలుతుండగానే... దానిపై సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి, టమోటో ముక్కలు, కొత్తిమీరలను చల్లాలి. వాటిపైన మరో టీస్పూన్ నూనె పోసి కాల్చాలి.
అట్టు బాగా కాలిన తరువాత మెల్లిగా తీసి రెండోవైపు కూడా బాగా కాల్చాలి. అంతే మసాలా టమోటో ఆమ్లెట్ రెడీ అయినట్లే...! వీటిని వేడిగా ఉన్నప్పుడే, చిల్లీ సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.