Publish Date: Fri, 23 Jan 2009 (20:49 IST)
Updated Date: Fri, 23 Jan 2009 (20:49 IST)
కావలసిన పదార్థాలు :
ఉప్పుడు బియ్యం... నాలుగు కప్పులు
మినప్పప్పు... ఒక కప్పు
పచ్చి బఠాణీలు... 50 గ్రాములు
కాలీఫ్లవర్... 50 గ్రాములు
బంగాళాదుంపలు... రెండు
టమోటా... ఒకటి
క్యారెట్... ఒకటి
ఉల్లిపాయలు... పావు కేజీ
జీడిపప్పు ముక్కలు... రెండు టీస్పూన్లు
ఎండుమిర్చి... ఆరు
వేయించిన శనగపప్పు.. రెండు టీస్పూన్లు
కొబ్బరి తురుము... ఒక టీ స్పూను
మినప్పప్పు... ఒక టీ స్పూను
ఆవాలు... ఒక టీ స్పూను
కరివేపాకు... 10 రెమ్మలు
కొత్తిమీర... తగినంత
నెయ్యి... 50 గ్రాములు
తయారీ విధానం :
బియ్యం, మినప్పప్పు విడివిడిగా రుబ్బుకోవాలి. తరువాత రెండింటినీ కలిపి ఉప్పు వేసి ఓ రాత్రంతా పులియబెట్టాలి. బంగాళాదుంపలు, కాలీఫ్లవర్, క్యారెట్‌లను చిన్న చిన్న ముక్కలుగా కోసి కాస్తంత పలుకు ఉండేటట్లుగా ఉడికించి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, జీడిపప్పులను చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. కొబ్బరి తురుము, వేయించిన శనగపప్పు, ఎండుమిర్చి, కొత్తిమీరలను కలిపి మెత్తగా నూరాలి.
ఓ బాణలిలో 3 టీ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసి చిటపటలాడిన తరువాత టమోటా, ఉల్లి, జీడిపప్పు, ఇతర కూరగాయలముక్కలు, పచ్చి బఠాణీలు వేసి వేయించాలి. ఇందులోనే కొబ్బరి పచ్చిమిర్చి ముద్దను కలపాలి. ఈ మిశ్రమాన్నంతటినీ ఇడ్లీపిండిలో కలిపి కొద్దికొద్దిగా రేకుల్లో వేసి ఉడికిస్తే.... మసాలా ఇడ్లీ రెడీ.!