కావలసిన పదార్థాలు :
పుట్టగొడుగులు (మష్రూమ్స్)... పావు కేజీ
బంగాళాదుంపలు... పావు కేజీ
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిర్చి... ఆరు
కొత్తిమీర... 2 కట్టలు
మిరియాలపొడి... పావు టీ.
ఉప్పు... సరిపడా
నిమ్మకాయ... ఒకటి
కోడిగుడ్డు... ఒకటి
బ్రెడ్ పొడి... 100గ్రా.
నూనె... వేయించడానికి సరిపడా
తయారీ విధానం :
పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడిగి, నీళ్లలో మరిగించి సన్నటి ముక్కలుగా కోయాలి. బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదమాలి. పాన్‌లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించాలి. అందులోనే ఉడికించిన బంగాళాదుంపల పొడి, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి.
ఇందులోనే తరిగిన పుట్టగొడుగుల్ని కూడా వేసి కలిపి చిన్న వడల్లా చేయాలి. కోడిగుడ్డు సొనను గిలకొట్టి అందులో కొంచెం ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు పుట్టగొడుగు వడల్ని ఈ సొనలో ముంచి, బ్రెడ్ పొడిలో దొర్లించి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించాలి. అంతే మష్రూమ్స్ కట్‌లెట్స్ తయారైనట్లే...! వీటిని టొమాటో సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.