Article Fast Food %e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d %e0%b0%a6%e0%b1%8b%e0%b0%b8%e0%b1%86 108101600075_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రెడ్ దోసె

Advertiesment
వంటకాలు ఫాస్ట్ ఫుడ్ మైదా పిండి మజ్జిగ పచ్చిమిర్చిపంచదార జీరా రవ్వ తరుగు బ్రెడ్ పొడి క్యారెట్ తరుగు మిర్చి వంటసోడా
FileFILE
కావలసిన పదార్థాలు :
మైదా... అర కప్పు
బ్రెడ్ పొడి... ఒక కప్పు
చిక్కని మజ్జిగ... ఒక కప్పు
రవ్వ... అర కప్పు
క్యారట్ తురుము... అర కప్పు
కొత్తిమీర తరుగు... అర కప్పు
పచ్చి మిర్చి తరుగు... అర కప్పు
పంచదార... అర టీస్పూన్
జీరా... అర టీస్పూన్
వంటసోడా... పావు టీస్పూన్
నూనె, ఉప్పు... తగినంత

తయారీ విధానం :
ఒక పాత్రలో మైదా పిండి, బ్రెడ్ పొడి, మజ్జిగ, రవ్వ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగులు, పంచదార, జీరా, ఉప్పు లాంటి పైన చెప్పిన పదార్థాలన్నింటినీ కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి దోసె పిండి లాగా చేసుకుని, ఉప్పు సరిజూసుకోవాలి.

ఇప్పుడు కాలుతున్న పెనంపై నూనె వేసి దోశెలుగా పోయాలి. ఈ దోసెలను చట్నీతోగానీ, సాస్‌తోగానీ కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. అప్పటికప్పుడు త్వరగా టిఫిన్ తయారు చేయాలనుకునేవారికి, ఈ బ్రెడ్ దోసెను చేసుకోవటం చాలా సులభమవుతుంది. మీరు కూడా ప్రయత్నిస్తారు కదూ...!

Share this Story:

Follow Webdunia telugu