కావలసిన పదార్థాలు :
మినప్పొట్టు... అరకేజీ
మినప్పప్పు... పావు కేజీ
నెయ్యి... తగినంత
మిరియాలపొడి... మూడు టీ.
జీలకర్ర పొడి... మూడు టీ.
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
మినప్పొట్టు, మినప్పప్పు ఒక పూట ముందు నానబెట్టి మెత్తగా రుబ్బి అందులో మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి గట్టి ముద్దలా కలపాలి. పాలిథీన్ కవర్‌మీద నూనె రాసి అరచేతిలో పట్టేంత పిండిముద్దల్ని తీసుకుని చిన్న చిన్న ఉండలు చేసి పలుచగా గుండ్రంగా వత్తి, బాగా కాగుతున్న నేతిలో మెల్లగా వేస్తూ బాగా వేగనివ్వాలి. చల్లారితే ఈ వడలు గట్టిగా బిగుసుకుంటాయి. 15 రోజులదాకా నిల్వ ఉంటాయి.