Article Fast Food %e0%b0%ac%e0%b0%a0%e0%b0%be%e0%b0%a8%e0%b1%80 %e0%b0%b8%e0%b0%ae%e0%b1%8b%e0%b0%b8%e0%b0%be%e0%b0%b2%e0%b1%81 108091900080_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బఠానీ సమోసాలు

Advertiesment
వంటకాలు ఫాస్ట్ఫుడ్ మైదాపిండి నూనె ఉప్పు బఠాణీ తురుము పచ్చిమిర్చి నూనె కిస్మిస్ అల్లం జీడిపప్పు కారంపొడి
FileFILE
కావలసిన పదార్థాలు :
మైదాపిండి... ఒక కప్పు
నూనె... వేయించేందుకు సరిపడా
ఉప్పు... సరిపడా

ఫిల్లింగ్ కోసం...
ఉడికించిన బఠాణీలు... ఒక కప్పు
సన్నగా తురిమిన పచ్చిమిర్చి... రెండు
నూనె... ఒక టీస్పూన్
కిస్‌మిస్‌లు... ఒక టీస్పూన్
సన్నగా తురిమిన అల్లం... ఒక టీస్పూన్
జీలకర్ర... అర టీస్పూన్
జీడిపప్పు... ఒక టీస్పూన్
కారంపొడి... అర టీస్పూన్
గరంమసాలా... అరటీస్పూన్

తయారీ విధానం :
ఉడికించిన బఠానీలను చిదుముకోవాలి. బాణలిలో నూనెపోసి జీలకర్ర వేసి వేయించిన తరువాత పైన ఫిల్లింగ్ కోసం చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేసి బాగా వేయించాలి. వేగిన తరువాత ఒక పాత్రలోకి తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు నూనె, ఉప్పు నీటితో మైదాపిండిని బాగా కలిపి ముద్ద చేసుకోవాలి. ఆ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుని చపాతీల్లాగా చేసుకోవాలి. చపాతీలలోకి బఠానీల మిశ్రమాన్ని వేసి సమోసాలలాగా చుట్టుకుని, తడిచేత్తో కొసలను మూసేయాలి.

బాగా కాగుతున్న నూనెలో పైన తయారుచేసుకున్న సమోసాలను వేసి బంగారువర్ణం వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి బఠానీ సమోసాలు సిద్ధమైనట్లే...! వీటిని టమోటో సాస్ లేదా పుదీనా చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu