కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు పెద్దవి... అరకేజీ
మరిగించిన నీళ్ళు... ఒక లీటర్
జీలకర్ర... ఒక టీ.
అల్లం... కొద్దిగా
పచ్చిమిర్చి... ఏడు
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
ముందుగా నీళ్లను మరిగించాలి. బంగాళాదుంపల తొక్కు తీసి చిప్స్ మాదిరిగా కోసుకోవాలి. మరిగించిన నీళ్లలో ఉప్పు వేసి వీటిని అందులో వేసి ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికాయి అనుకున్న తరవాత నీళ్లన్నీ వంపేయాలి. జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చిలను మెత్తని పేస్టులా చేసి, దానికి కొద్దిగా ఉప్పు కలిపి, ఉడికించిన చిప్స్ మీద చల్లి అన్నింటినీ కలపాలి.
ఇప్పుడు వీటిని ఎండలో నాలుగైదు గంటలపాటు బాగా ఎండనివ్వాలి. తరవాత గాలిచొరని డబ్బాలో నిల్వచేసుకుని కావాలనుకున్నప్పుడు నూనెలో వడియాల మాదిరిగా వేయించి తీసేయాలి. అంతే కమ్మగా, కారంగా ఉండే బంగాళాదుంపల చిప్స్ తయారైనట్లే...!