Article Fast Food %e0%b0%ab%e0%b1%8d%e0%b0%b0%e0%b1%88%e0%b0%a1%e0%b1%8d %e0%b0%ac%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b0%be %e0%b0%ac%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9c%e0%b1%80 108111500082_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రైడ్ బనానా బజ్జీ

Advertiesment
వంటకాలు ఫాస్ట్ ఫుడ్ అరటిపండ్లు బియ్యంపిండి తెల్లనువ్వులు పంచదార పొడి వంటసోడా కొబ్బరిపొడి నెయ్యి దాల్చిన చెక్క పొడి
కావలసిన పదార్థాలు :
అరటిపండ్లు... ఎనిమిది
బియ్యంపిండి... వంద గ్రాములు
తెల్లనువ్వులు... వంద గ్రాములు
పంచదార పొడి... రెండు వందల గ్రాములు
వంటసోడా... అర టీస్పూన్
కొబ్బరిపొడి... 50 గ్రాములు
కొబ్బరిపాలు... రెండు కప్పులు
నెయ్యి... వేయించేందుకు సరిపడా
దాల్చిన చెక్క పొడి... పావు టీస్పూన్

తయారీ విధానం :
బియ్యం పిండి, తెల్లనువ్వులు, పంచదార పొడి, వంటసోడా, కొబ్బరి పొడి, కొబ్బరిపాలు, దాల్చిన చెక్క పొడి అన్నింటినీ తీసుకుని బాగా కలపాలి. అందులో తగినన్ని నీళ్లు పోస్తూ బజ్జీ పిండిలాగా కాస్త జారుగా కలుపుకోవాలి. అలాగే, అరటిపండ్లను కావాల్సిన సైజులో నిలువుగా కత్తిరించుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు బాణలిలో నెయ్యి పోసి బాగా మరగనివ్వాలి. మంట తగ్గించి అరటికాయ ముక్కల్ని పైన కలిపి ఉంచుకున్న పిండిలో ముంచి, మరుగుతున్న నెయ్యిలో వేసి బాగా వేయించాలి. అలా మొత్తం అరటి ముక్కల్ని పిండిలో ముంచి నెయ్యిలో వేసి, బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే ఫ్రైడ్ బనానా బజ్జీలు సిద్ధమైనట్లే...!

చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తినే ఫ్రైడ్ బనానా బజ్జీలు తయారు చేయడం కూడా చాలా సులభమే కాబట్టి... ఈ వీకెండ్‌లో మీరు కూడా మీ పిల్లలకు ఓ స్పెషల్ ఫుడ్ లాంటి ఈ ఫ్రైడ్ బనానా బజ్జీలను చేసి ఇస్తారు కదూ...! అన్నట్టు... వీటికి ఎలాంటి సైడ్ డిష్ కూడా అవసరం లేదండోయ్...! చేసిన వెంటనే అలా, వేడి వేడిగా లాగించేయవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu