కావాల్సిన పదార్థాలు:
పచ్చి పెసలు: అరకిలో
నూనె : తగినంత
కారం: కప్పు
జీలకర్ర పొడి : స్పూను
ఉప్పు : తగినంత
కొత్తిమీర : ఓ కప్పు (తరిగి పెట్టుకున్న)
తయారీవిధానం:
ఒక పూట ముందుగా పెసలను నానబెట్టాలి. ఆ తర్వాత వాటిలో నీళ్లు లేకుండా వంపేసి నూనెలో కరకరలాడేటట్లు వేగిన తర్వాత తీయాలి. ఇలా వేయించిన పెసరపప్పులో కారం, జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర, తురుము వేసి బాగా కలపాలి. అంతే రుచిరుచిగా ఫ్రైడ్ దాల్ మీ ముందుంటుంది.