Article Fast Food %e0%b0%ab%e0%b1%8d%e0%b0%b0%e0%b1%88%e0%b0%a1%e0%b1%8d %e0%b0%9a%e0%b0%aa%e0%b0%be%e0%b0%a4%e0%b1%80 107080400013_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రైడ్ చపాతీ

Advertiesment
చపాతీలను రాత్రి పూట కుక్ చేసి ఓ హాట్ ప్యాక్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి
కావలసిన పదార్థాలు:
క్యారెట్, కాలీఫ్లవర్, బీట్‌రూట్ తురుములు: చెరో కప్
ఉల్లిపాయ తురుము: ఒక కప్
పచ్చి మిర్చి: నాలుగు
వెల్లుల్లి: నాలుగు
అల్లం: చిన్న ముక్క
పంచదార: ఒక టేబుల్ స్పూన్
నిమ్మకాయ: ఒకటి
జీలకర్ర: ఒక స్పూన్
ఉప్పు : తగినంత
కొబ్బరి తురుము: ఒక కప్

ఇలా చేయండి:
చపాతీలను రాత్రి పూట కుక్ చేసి ఓ హాట్ ప్యాక్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. ఉదయం వాటిని ముక్కలుగా చేసి ఒక ప్లేట్‌లో తీసుకోండి. బాణలి వేడయ్యాక అందులో నూనెను పోసి ఉల్లిపాయలు, వెల్లుల్లి అల్లం పేస్ట్‌లను అందులో వేసి వేయించండి. బాగా వేగాక వీటిలో జీలకర్ర సోపు గింజలను చేర్చండి. తురుమిన వెజిటేబుల్ తురుములను ఈ మిశ్రమంలో కలపండి వీటికి లెమన్ జ్యూస్, పంచదార, కొబ్బరి తురుమును చేర్చండి. ముక్కలు చేసిన చపాతీలను ఇందులోఈ మిశ్రమంలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి దించేయండి. ఫ్రైడ్ చపాతీ రెడీ. ఈ ఫ్రైడ్ చపాతీకి టమోటా సాస్, చిల్లీ సాస్‌లను సైడిష్‌గా వాడుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu