Publish Date: Tue, 05 Aug 2008 (16:50 IST)
Updated Date: Tue, 05 Aug 2008 (16:12 IST)
కావలసిన పదార్థాలు :
అరటిపండ్లు... మూడు
యాపిల్... ఒకటి
కమలాపండ్లు... రెండు
నిమ్మకాయ... ఒకటి
ద్రాక్ష... ఒక కప్పు
దానిమ్మ గింజలు.... ఒక కప్పు
చెర్రీస్... కొన్ని
చక్కెర.... అరకప్పు
తయారీ విధానం :
పండ్లు అన్నింటినీ ముక్కలు చేసుకోవాలి. నల్లబడకుండా ఉండేందుకు అరటి, యాపిల్ పండ్లను చివరగా ముక్కలు చేసుకోవాలి. తరువాత పండ్ల ముక్కలన్నింటిపైనా నిమ్మరసం పోయాలి. చక్కెరలో కాస్తంత నీరు పోసి కరిగేదాకా వేడిచేయాలి. చక్కెర ద్రవాన్ని కూడా పండ్ల ముక్కలపై పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లబడిన తర్వాత అతిథులకు సర్వ్ చేయండి. చక్కెర తినకూడనివారు కొంచెం చక్కెరకు బదులుగా ఉప్పు, ఛాట్ మసాలాలను చల్లుకుని ఆరగించవచ్చు.