కావలసిన పదార్థాలు :
ఫూల్ మఖానీస్... పావు కేజీ
నూనె... వేయించేందుకు సరిపడా
వాముపొడి... ఒక టీ.
కారం... ఒక టీ.
పుదీనా ఆకు (వేయించినది)... సగం కప్పు
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
ఫూల్ మఖానీస్‌ను కొద్దిగా నీరుపోసి పదినిమిషాలు నానబెట్టాలి. తరవాత వడగట్టి ఆరబెట్టాలి. కాస్తంత తడిగా ఉన్నప్పుడే బాణలిలో నూనె కాచి అందులో ఫూల్ మఖానీస్ వేసి దోరగా వేయించి తీయాలి. వేడిగా ఉన్నప్పుడే వీటికి వాముపొడి, కారం, ఉప్పు, పుదీనా ఆకు వేసి కలిపితే ఫూల్ మఖానీస్ చిప్స్ తయారైనట్లే...! మామూలు చిప్స్‌తో బోర్ ఫీలవుతుండే పిల్లలకు మఖానీ చిప్స్ నిజంగా ఓ వెరైటీ స్నాక్సే...!