Publish Date: Thu, 28 Jun 2007 (15:48 IST)
Updated Date: Thu, 28 Jun 2007 (15:38 IST)
కావలసిన పదార్థాలు :
ఉల్లిపాయ ముక్కలు: అర కప్పు
రొయ్యలు: 1/4 కిలో
అల్లం ముద్ద: ఒక స్పూన్
వెల్లుల్లి ముద్ద: ఒక స్పూన్
ఆవనూనె: అర కప్పు
ఆవాలు: ఒక స్పూన్
పలావు ఆకులు: రెండు
పంచదార: ఒక స్పూన్
పాలకూర: 100 గ్రాములు
మిరియాలు: మూడు
పచ్చసొన: రెండు గ్రుడ్లు
లవంగాలు: రెండు
తయారీ విధానం:
ఒక పాత్రలో రెండు కప్పుల నీటిని తీసుకుని మిరియాలు, లవంగాలు, పలావ్ ఆకులు, అల్లం, ఉల్లిపాయ తరుగులు వేసి వేయించి అందులో రొయ్యలు కలిపి బాగా వేయించి పది నిమిషాలు నీటిలో మరిగించండి. పాలకూర ఆకుల్ని కడిగి వాటిలో పంచదార చేర్చి ఉడికించి పక్కన పెట్టుకోండి. పాలకూర ఉడికాక అందులోని నీటిని వార్చి వేడినీటిలో మరో సారి మరిగించి అయిదు సెకండ్లు ఉంచి వెంటనే ఐస్‌వాటర్ ముంచండి. గ్రుడ్లలోని పచ్చసొనని బాగా గిలకొట్టి వాటికి ఉప్పు, నిమ్మరసం కలిపి మళ్ళీ గిలకొట్టాలి. ఇందులో ఆవనూనెను కూడా చేర్చుకోండి. ఇది క్రీమ్‌లా తయారయ్యాక ప్లేట్‌లో పాలకూర ఆకుల్ని తీసుకుని వీటికి మధ్యలో ఉడికించిన రొయ్యల ముక్కల్ని అందంగా డెకరేట్ చేసుకుని వాటిపై క్రీమ్‌ను చేర్చి సర్వ్ చేయండి.