కావలసిన పదార్థాలు :
బియ్యం... అర కేజీ
పొట్లకాయ... పావు కేజీ
కరివేపాకు... ఒక కట్ట
ఎండుమిర్చి... రెండు
ఆవాలు... పావు టీ.
నెయ్యి... 50గ్రా.
జీలకర్ర... ఒక టీ.
పల్లీలు... 50గ్రా.
నువ్వులు... 2 టీ.
గరంమసాలా... అర టీ.
మిరియాలు... ఒక టీ.
ఎండుకొబ్బరి... చిన్నముక్క
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
పొట్లకాయ పై పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. బియ్యం కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి. ఓ గిన్నెలో నెయ్యి వేసి ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు వేయాలి. పొట్లకాయ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు వేయించాలి. మూడున్నర గ్లాసుల ఎసరు పోసి మరిగించాలి. ఎసరు మరిగాక బియ్యం కూడా వేసి తగినంత ఉప్పు వేసి ఉడికించాలి.
మరో బాణలిలో మిగిలిన మసాలా దినుసులు పల్లీలు, ఎండుకొబ్బరి... అన్నీ విడివిడిగా దోరగా వేయించి పొడిచేయాలి. తరవాత ఈ పొడిని ఉడికే అన్నంలో వేసి కలిపి, సన్ననిమంటమీద దమ్ చేసి దించితే పొట్లకాయ మసాలా బాత్ రెడీ అయినట్లే...!