కావలసిన పదార్థాలు :
బియ్యం... అరకేజీ
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిర్చి... ఎనిమిది
టమోటోలు... రెండు
వెల్లుల్లిముద్ద... ఆరు టీ.
పుదీనా ఆకులు... ఒక కప్పు
కొత్తిమీర... ఒక కప్పు
జీడిపప్పులు... కాసిన్ని
నెయ్యి, నూనె... చెరో నాలుగు టీ.
ఉప్పు, కారం... తగినంత
తయారీ విధానం :
బియ్యాన్ని కాస్తంత పొడిపొడిగా వండి పక్కన ఉంచాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమోటోలను సన్నగా తరిగి ఉంచాలి. ఇప్పుడు ఓ మందపాటి గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను వేసి దోరగా వేయించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి ముద్ద, టొమోటోలను వేసి కాసేపటి తరువాత పుదీనా, కొత్తిమీరలను కూడా చేర్చి మరికాసేపు వేయించాలి.
అందులోనే తగినంత ఉప్పు, కారం మరియు జీడిపప్పులు వేసి రెండు నిమిషాలపాటు వేయించి దించేయాలి. ఇప్పుడు ముందే వండిపెట్టుకున్న అన్నంలో ఈ మిశ్రమం వేసి కలియబెట్టాలి. అంతే నోరూరించే పుదీనా మసాలా రైస్ రెడీ అయినట్లే..! మధ్యాహ్నంపూట ఆకలంటూ పేచీపెట్టే చిన్నారులకు ఇది ఓ చక్కటి ఫాస్ట్‌ఫుడ్‌గా చెప్పుకోవచ్చు.