Publish Date: Sat, 16 Aug 2008 (17:55 IST)
Updated Date: Sat, 16 Aug 2008 (16:33 IST)
కావలసిన పదార్థాలు :
మైదా... కొద్దిగా
బియ్యం పిండి... అర కేజీ
వేరుశెనగ పప్పు... 150 గ్రాములు
పచ్చిమిరప కాయలు... సరిపడా
పచ్చి శెనగ పప్పు... 50 గ్రాములు
అల్లం... కొద్దిగా
నువ్వులు... 50 గ్రాములు
ఉప్పు... సరిపడా
తయారీ విధానం :
ముందుగా పచ్చి శనగ పప్పు నాన బెట్టి బుట్టలో వేసి ఉంచాలి. తరువాత శనగ పప్పును కచ్చా పచ్చాగా నూరుకుని జల్లించిన నువ్వులను, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి, బియ్యంపిండి కలిపి దంచాలి.
స్టౌపై కాగుతున్న నూనెలో దంచి ఉంచుకున్న పప్పు ముద్దలోంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని పలుచగా చెక్కలుగా వత్తి వేయాలి. తరువాత అవి రెండువైపులా ఎర్రగా కాలిన తరువాత తీసి న్యూస్ పేపర్‌పై వేయాలి. ఇలా మొత్తం పిండిని చెక్కలుగా చేసుకోవాలి. శనగపప్పుకు, బియ్యం పిండిని కలిపడం వల్ల చెక్కలు నూనెను ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి.